Guppedantha Manasu: మితిమీరిన శైలేంద్ర పైశాచికం.. భయం గుప్పెట్లో జగతి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తమ్ముడికి వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేకపోతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 23 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకిలా చేశావు మీ ఇద్దరి సంతకాలు ఉన్నాయి రిషి ఎప్పటికీ ఫ్రాడ్ పనులు చేయడు ఇక మిగిలింది నువ్వే అంటూ వసుధారని బ్లెయిమ్ చేస్తూ మాట్లాడుతాడు శైలేంద్ర. కొంచెం మర్యాదగా మాట్లాడండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది తెలియకుండా ఎక్కడ ఏ ఫైలు, ఏ చెక్కు ముందు కదలదు అంటుంది వసు.
అవునా మరి మెడికల్ కాలేజ్ అప్రూవల్ ఎలా తీసుకొచ్చారు అంటూ నిలదీస్తాడు శైలేంద్ర. రిషి సార్ కి మంచి జరగడం కోసం చేసిన పని అది అంతేకానీ ఆయన గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించే పని ఇక్కడ ఎవరూ చేయరు అని చెప్తుంది వసుధార. మరి ఆ చెక్ మినిస్టర్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది అని నిలదీస్తాడు శైలేంద్ర. అదే అర్థం కావటం లేదు ఎలాగో మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా అక్కడే నిజా నిజాలు తేలుతాయి అంటుంది.
నువ్వెందుకు నేను, జగతి పిన్ని వెళ్తాంలే అంటాడు శైలేంద్ర. అలా కుదరదు నా మీద పడిన మచ్చని నేనే క్లియర్ చేసుకుంటాను అంటుంది వసుధార. ఏంటి పిన్ని వసుధార నేను ఏం చెప్పినా వినట్లేదు నువ్వైనా చెప్పు అంటూ బెదిరించినట్లుగా మాట్లాడుతాడు శైలేంద్ర. నువ్వు ఉండు వసు నేను శైలేంద్ర వెళ్లి వస్తాము అంటుంది జగతి. అయినా వసుధార ఒప్పుకోవటంతో జగతి ఒప్పిస్తుంది.
శైలేంద్ర తో పాటు బయలుదేరుతుంది జగతి. దారిలో వసుధార ఎలాంటిది పిన్ని అని అడుగుతాడు శైలేంద్ర. తను నిప్పు, నిజాయితీకి మారుపేరు అంటుంది జగతి. మరి ఈ ఫ్రాడ్ ఎలా జరిగింది అని అడుగుతాడు శైలేంద్ర. అదే అర్థం కావటం లేదు అంటుంది జగతి. ఇందులో ఆలోచించటానికి ఏముంది పిన్ని ఈ ఫ్రాడ్ మొత్తానికి కర్త కర్మ క్రియ అంతా నేనే అంటూ నిజాన్ని బయటపెడతాడు శైలేంద్ర.
ఇప్పటికిప్పుడు కావాలంటే నిన్ను గాల్లో కలిపేయగలను కానీ అలా చేయను అంటాడు. నువ్వు ఇప్పటికిప్పుడు నన్ను చంపేసిన నాకు ఏ బాధ లేదు రిషి కోసం నేను దేనికైనా సిద్ధమే అంటుంది జగతి. నాకు తెలుసు పిన్ని నీ ధైర్యం గురించి అయినా ఇప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి ఏమని చెప్తావు అని అడుగుతాడు శైలేంద్ర. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను అంటుంది జగతి.
పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే ఏ పని నేను చేయను దయచేసి ఇలాంటి పనులు మానుకో అని చేతులు జోడించి వేడుకుంటుంది జగతి. ఇందాక ఉన్న ధైర్యం ఏమైంది పిన్ని.. నేను చెప్పినట్లు చేయండి రిషిని వసుధారని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయండి కాలేజీ ఎండి సీట్లో నన్ను కూర్చోబెట్టండి లేకపోతే రిషి కలలు కన్న డీబిఎస్టీ కాలేజీ ఉండదు మొత్తానికి రిషి లేకుండా పోతాడు అంటూ బెదిరిస్తాడు శైలేంద్ర.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది జగతి. నేను చెప్పినట్లు చెయ్యు అంటూ ఏదో చెప్తాడు శైలేంద్ర. ఆ తర్వాత మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెక్ గురించి అడుగుతారు. ఇందులో రిషి తప్పేమీ లేదు నా తమ్ముడు అలాంటివాడు కాదు తప్పంతా సారధి చేసి ఉంటాడు అతనిని నమ్మి నేను ఈ కాంటాక్ట్ ఇచ్చాను అంటాడు శైలేంద్ర.
నేను నోటి మాటలు చెప్పటం లేదు సాక్షాలతో సహా మీ ముందు పెట్టాను కదా అయినా నన్ను అంటారేంటి అంటూ ఎదురు ప్రశ్నే వేస్తాడు సారధి. నా తమ్ముడే అంటావా అంటూ సారధి మీదికి వస్తాడు శైలేంద్ర. శైలేంద్రని వారిస్తాడు మినిస్టర్. రిషి మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఏం చేద్దాము మీరే చెప్పండి అని జగతిని అడుగుతాడు మినిస్టర్. జగతిని బెదిరిస్తున్నట్లుగా చూస్తాడు శైలేంద్ర.
చెక్ పవర్ ఎవరెవరికి ఉందో వారందరినీ ప్రశ్నిద్దాం అంటుంది జగతి. అదే కరెక్ట్.. అప్పుడే నిజానిజాలు బయటికి వస్తాయి అంటాడు మినిస్టర్. ఆరోజు రాత్రి నిద్రపోతున్న రిషి దగ్గరికి వచ్చి నా చేత నా కొడుకు మీద నింద వేసే లాగా చేస్తున్నావు భగవంతుడా ఏంటి నాకీ శిక్ష అని బాధపడుతుంది జగతి. రిషి మీద జగతి నీడ పడటంతో రిషికి మెలకువ వస్తుంది. జగతి అక్కడ ఉండటం చూసి ఏంటి మేడం ఈ టైం లో ఇలా వచ్చారు అని అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.