సొట్టబుగ్గపై ముద్దు పెడతా.. షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చిన నెటిజన్, బాద్ షా ఏమన్నాడంటే..?
ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంటె నెటిజన్ల చిలిపి ప్రశ్నలకు చిరాకోచ్చేస్తోంది స్టార్స్ కు. దాంతో గట్టిగా కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కు ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఆయన ఏం చేశారంటే..?
బాలీవుడ్ బాద్షా సొట్ట బుగ్గల సుందరుడు నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తు ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.
రీ ఎంట్రీలో జోరు చూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). జీరో సినిమా డిజాస్టర్ అయిన తరువాత నాలుగైదేళ్లు సినిమాలకుగ్యాప్ ఇచ్చాడు షారుఖ్. ఈ గ్యాప్ లో.. షారుఖ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక ఈమధ్య పటాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్.. 100కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతే కాదు.. తాజాగా జవాన్ సినిమాతో మారోసారి వెయ్యి కోట్ల మార్క్ ను దాటి.. బాలీవుడ్ లో రికార్డ్ బ్రేక్ చేశాడు.
60 ఏళ్లకు దగ్గరగా ఉన్నా.. షారుఖ్ ఖాన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. సిక్స్ ప్యాక్ బాడీని మెయింటేన్ చేస్తూ.. కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా అద్భుతం చేస్తున్నాడు కింగ్. అంతే కాదు అమ్మాయిల మనసుల్లో ఇంకా కలల రాకుమారుడిగానే ఉన్నాడు. ఈక్రమంలో షారుఖ్ పై ప్రేమతో నెటిజన్లు పిచ్చిపిచ్చి ప్రశ్నలతో పాటు.. పిచ్చి పిచ్చి కోరికలు కూడా అడిగేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉంటాడో.. సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటాడు. అంతే కాదు.. టౌైమ్ చూసుకుని.. ఎప్పుడూ.. ఫ్యాన్స్ తో చిట్ చాట్ లు చేస్తుంటాడు. అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు ఇలా సోషల్ మీడియా వేదికగా కూడా షారుక్ ఖాన్ తన సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తారు.
ఇక ఇలానే చాలా మంది ప్యాన్స్ షారుఖ్ ను వింత వింత ప్రశ్నలు, వింత కోరికలు అడిగి విసిగిస్తుంటారు. బాలీవుడ్ హీరోలలో ఇాలాంటి వింత అనుభవం ఎదుర్కొన్నది మాత్రం షారుఖ్ నే. ఇక తాజాగా ఒక అభిమాని నుంచి విచిత్రమైనటువంటి ప్రశ్న ఆయనకు ఎదురైంది.
ఈ సందర్భంగా ఓ లేడీ ఫ్యాన్ షారుక్ ఖాన్ ను ప్రశ్నిస్తూ నేను మీ డింపుల్ పై ముద్దు పెట్టుకోవచ్చా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు షారుఖ్ ఖాన్ షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ఈ ప్రశ్నకు రిప్లై ఇస్తూ దేనిపై ముద్దు పెట్టుకుంటారు కుడివైపు ఉన్న డింపుల్ నా? లేక ఎడమ వైపుదా అంటూ రిప్లై ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ గా బుక్ చేసుకోండి అంటూ సమాధానం చెప్పారు.
ఇక తన అభిమాని రొమాంటిక్ కోరిక అడిగింది కాబట్టి ఇలా చెప్పాడు. ఈమధ్య ఒకడు నయనతారకు పడిపోయారా అని అడిగాడు. తను ఒకరి భార్య.. అలా ఎలా అంటారు అంటూ లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడు షారుఖ్. ఇక తనకు రెండు జవాన్ టికెట్లు ఫ్రీగా కావాలని.. తన గర్ల్ ఫ్రెండ్ ను సినిమాకు తీసుకెళ్తాను అంటూ... ఓ యువకుడు.. షారుక్ ను అడగ్గా.. షారుఖ్ ఆ నెటిజన్ గూబ గుయ్.. మనే సమాధానం చెప్పాడు.
ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమోగానీ.. టికెట్లు ఫ్రీగా దొరకవ్ బ్రదర్.. టికెట్ కావాలంటే పైసల్ పెట్టాల్సిందే. రొమాన్స్ కూడా ఛీప్‌గా దొరికేయాలంటే ఎలా?.. వెళ్లి డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కొని, నీ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లు. ఇద్దరూ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి.. అంటూ చురకలంటించారు షారుఖ్. ఇలా షారుఖ్ ఖాన్ చిట్ ఛాట్ చేస్తే చాలు వింత ప్రశ్నలు తన్నుకుని వస్తుంటాయి.