- Home
- Entertainment
- ఇంటి నేమ్ ప్లేట్ కు షారూఖ్ పెట్టిన ఖర్చుతో.. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు.. ఇంతకీ ఎంత ఖర్చుపెట్టాడంటే...?
ఇంటి నేమ్ ప్లేట్ కు షారూఖ్ పెట్టిన ఖర్చుతో.. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు.. ఇంతకీ ఎంత ఖర్చుపెట్టాడంటే...?
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత గుర్తుకు వస్తుంది షారుఖ్ ఖాన్ ఇల్లు చూస్తుంటే. ఆయన ఇంటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే.. రీసెంట్ గా ఓ సామాన్యుడు చక్కగా ఇల్లుకట్టుగోగలిగేంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటికి నేమ్ ప్లేట్ చేయించుకున్నారు బాలీవుడ్ బాద్ షా. మరి ఆ ఒకక్క నేమ్ ప్లేట్ కు ఆయన ఎంత డబ్బు వదలించుకుని ఉంటారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు తన ఇల్లు మన్నత్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంటిని ఎప్పుడూ తీర్చి దిద్దుతూనే ఉంటారు స్టార్ హీరో. ఇక రీసెంట్ గా కూడా మన్నత్ కు కొన్ని మరమ్మతులు చేయించారు. అందులో భాగంగా ఇంటి నేమ్ ప్లేట్ ను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఒక్క నేమ్ ప్లేట్ కోసమే చాలా హోమ్ వర్క్ చేశారు షారుఖ్ ఖాన్ దంపతులు మన్నత్ ల్యాండ్స్ ఎండ్ అంటూ నిలువు అక్షరాలతో నేమ్ ప్లేట్ డిజైన్ చేయించారు. . స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. ఆ నేమ్ ప్లేట్ కు తన నైపుణ్యాలతో రూపాన్నిచ్చినట్టు సమాచారం.
ఇక ఇప్పుడు ఈ నేమ్ ప్లేట్ గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది, ఇది సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోంది. ..? మామూలుగా అయితే దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. కానీ, దానికి పెట్టిన ఖర్చే ఇప్పుడు దేశమంతటా పెద్ద చర్చకు దారి తీసింది.
ఇక అంతా మాట్లాడుకుని.. ఔరా అంటూ నోటిమీద వేలు వేసుకునేలా ఆరడుగుల శిలాఫలకానికే దాదాపుగా 25 లక్షలకు పైగా ఖర్చు పెట్టారట షారుఖ్ దంపతులు. ఆ డబ్బుతో సామాన్యుడు ఓ చిన్నపాటి ఇంటిని కొనుక్కొని సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు అంటూ.. బాలీవుడ్ లో పెద్ద చర్చ జురుగుతోంది.
షారూఖ్ కుటుంబానికి సరిపోయేలా క్లాసీ టచ్ ఇచ్చేందుకే నేమ్ ప్లేటుకు ఇంతలా ఖర్చు పెట్టారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఆమధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాద్ షా... మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నాడు.
మూడేళ్ల తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న షారూక్.. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాంలతో కలిసి పఠాన్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమాలో తన ప్రాణ స్నేహితుడు సల్మాణ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. మరో వైపు అట్లీ దర్శకత్వంలో నయనతార, సాన్యా మల్హోత్రాలతో కలిసి మరో సినిమా కూడా చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో
మరో వైపు శరణార్థుల పరిస్థితిని కళ్లకు కట్టేలా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న దున్కీ సినిమాలోనూ నటించనున్నాడు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించనుంది. ఇలా ఏజ్ బార్ అవుతున్నా..మళ్ళీ తన కెరీర్ ను బిజీ చేసుకుంటున్నాడు షారుఖ్.