- Home
- Entertainment
- 12 వేల కోట్ల ఆస్తితో బిలీనియర్ గా ఏకైక హీరో ఎవరో తెలుసా, టాప్ 5 రిచెస్ట్ స్టార్స్ వీరే?
12 వేల కోట్ల ఆస్తితో బిలీనియర్ గా ఏకైక హీరో ఎవరో తెలుసా, టాప్ 5 రిచెస్ట్ స్టార్స్ వీరే?
హురున్ ఇన్‌స్టిట్యూట్ 2025 సంవత్సరానికి ఇండియా రిచ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో భారతదేశంలోని అత్యంత సంపన్న సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. 12 వేల కోట్ల ఆస్తితో ఈ బిలియనీర్ల లిస్ట్ లో చేరిన ఏకైక హీరో ఎవరో తెలుసా?

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, షారుఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న సెలబ్రిటీ. ఆయన ఆస్తి 1.4 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు గా 12,490 కోట్లుగా సమాచారం. బాలీవుడ్ టాప్ 5 సంపన్న తారల జాబితాలో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.
జూహీ చావ్లా రెండో స్థానం
హురున్ జాబితాలో షారుఖ్ ఖాన్ తర్వాత ఆయన బిజినెస్ పార్ట్‌నర్, స్నేహితురాలు జూహీ చావ్లా ఉన్నారు. జూహీ, ఆమె భర్త జై మెహతాతో కలిపి వారి కుటుంబం మొత్తం ఆస్తి 7790 కోట్లు. ఆమె దేశంలోనే అత్యంత సంపన్న నటి.
హృతిక్ రోషన్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, బాలీవుడ్ సెలబ్రిటీలలో మూడో స్థానంలో హృతిక్ రోషన్ ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తి 2160 కోట్లు. తన బ్రాండ్ HRX విజయంతో ఆయన ఈ సంపదను సాధించారు. భార్యకు విడాకులు ఇస్తూ భారీగా భరణం కూడా ఇచ్చారు.
కరణ్ జోహార్
ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ అద్భుత ప్రదర్శనతో కరణ్ జోహార్, ఆయన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో నాలుగో స్థానంలో ఉన్నారు. కరణ్ మొత్తం ఆస్తి 1880 కోట్లు.
బిగ్ బీ అమితాబచ్చన్
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం టాప్ 5 లో కొనసాగుతున్నారు. ఆయన కుటుంబం మొత్తం ఆస్తి 1630 కోట్లు. ఇందులో అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆస్తులు ఉన్నాయి. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో వారు ఐదో స్థానంలో ఉన్నారు.