- Home
- Entertainment
- 2025 బాక్సాఫీస్ రిపోర్ట్ , 9 నెలలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, ఇండస్ట్రీని షేక్ చేసింది ఎవరు?
2025 బాక్సాఫీస్ రిపోర్ట్ , 9 నెలలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, ఇండస్ట్రీని షేక్ చేసింది ఎవరు?
2025 లో 9 నెలలు గడిచిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వందల సినిమాలు వెండితెరపై మెరిశాయి. మరి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సినిమాలేంటి. ఏ పరిశ్రమ ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.

Indian Box Office 2025
2025లో 9 నెలలు పూర్తయ్యాయి. ఈ సమయంలో, వివిధ చిత్ర పరిశ్రమల నుంచి వేల సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించగా, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నుంచి ఎన్ని సినిమాలు వచ్చి, ఎంత వసూలు చేశాయో చూద్దాం.
టాలీవుడ్ రిపోర్ట్
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది టాలీవుడ్. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెలుగు నుంచే వస్తున్నాయి. తెలుగు పరిశ్రమ నుంచి ఈ 9 నెలల్లో 206 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం, 'ఓజీ' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అన్ని సినిమాలు కలిసి 1540.81 కోట్లు వసూలు చేశాయి. ఇందులో పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా ఇప్పటి వరకూ 265 కోట్లు రాబట్టింది.
బాలీవుడ్ పరిస్థితి ఏంటి ?
2025లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, 9 నెలల్లో, హిందీ పరిశ్రమ నుంచి 189 సినిమాలు వచ్చాయి. ఇవి బాక్సాఫీస్‌పై భారీగా ప్రభావం చూపాయి. అన్ని సినిమాలు కలిసి 3235.54 కోట్లు వసూలు చేశాయి. అత్యధికంగా 'ఛావా' సినిమా 807.6 కోట్లు రాబట్టింది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి
గడిచిన 9 నెలల్లో కన్నడ పరిశ్రమ నుంచి 183 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్‌పై వాటి ప్రభావం గట్టిగానే చూపించింది. ఈ సినిమాలన్నీ కలిపి 406.81 కోట్లు వసూలు చేశాయి. ఇందులో 'మహావతార్ నరసింహ' సినిమా .326.48 కోట్లు రాబట్టింది.
అదరగొట్టిన మలయాళ పరిశ్రమ
మలయాళ పరిశ్రమ నుంచి గడిచిన 9 నెలల్లో 149 సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు ఇంకా బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉన్నాయి. అన్ని సినిమాలు కలిసి రూ.716.5 కోట్లు వసూలు చేశాయి. ఇందులో 'లోகா' సినిమా రూ.280 కోట్లు రాబట్టింది.
తమిళం నుంచి ఎక్కువ సినిమాలు
2025లో గడిచిన 9 నెలల్లో, తమిళ పరిశ్రమ నుంచి అత్యధికంగా 220 సినిమాలు వచ్చాయి. కొన్ని భారీ విజయాలు సాధించాయి. అన్ని సినిమాలు కలిసి రూ.1214.91 కోట్లు వసూలు చేశాయి. ఇందులో రజినీకాంత్ 'కూలీ' సినిమా 510 కోట్లు రాబట్టింది.
8981 కోట్లు వసూళ్లు
9 నెలల్లో అన్ని పరిశ్రమలు కలిసి, 2025లో 1214 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా 8981.36 కోట్లు వసూలు చేశాయి. ఇక మొత్తంగా ఇంకా మూడు నెలల టైమ్ ఉంది. ఈలోపు ఎన్నిసినిమాలు వస్తాయి. 2025 లో లో కలెక్షన్లు పరంగా కింగ్ ఎవరు అనేది చూడాలి.