షారూఖ్ కు కంటి సమస్య...అర్డెంట్ గా అమెరికా ప్రయాణం
ఏం జరిగింది...అసలు కంటికి ఏ సమస్య వచ్చింది. ముంబైలో అంత పెద్ద డాక్టర్స్ ఉంటారు..అయినా ఎందుకు సెట్ కాలేదు అనేది బయిటకు రాలేదు.
కొద్ది నెలల క్రితం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హెల్త్ అభిమానులను భయపెట్టింది. మే 21 న షారుఖ్ ఖాన్‌కు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అప్పుడు ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే.. తొలుత వడదెబ్బతో అస్వస్థతకు గురై.. షారుఖ్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. షారుఖ్‌కు వడదెబ్బతో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు చెప్పుకున్నారు. కాగా, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాగానే కోలుకున్నాడు అనుకుంటే ఇప్పుడు షారూఖ్ మరోసారి మెడికల్ హెల్ప్ కావాల్సి వచ్చింది. ఈ సారి కంటి సమస్య షారూఖ్ కు వచ్చినట్లు తెలుస్తంది. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తున్నారు. ఇప్పుడు కంటి సమస్య విషయం బయటికి రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోమవారం జూలై 29న షారూఖ్ ఖాన్ ముంబై లో హాస్పటికల్ కు వెళ్ళారు. అక్కడ ఆయన కంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నారు. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు. ఆ డ్యామేజ్ రెక్టిఫై చేసుకోవటానికి అర్జెంటుగా ఆయన అమెరికా వెళ్తున్నట్లు చెప్తున్నారు.
ఈ రోజు లేదా రేపు షారూఖ్ ఖాన్ ...అమెరికా వెళ్లి తన కంటికి సర్జరీలాంటిది చేయించుకుంటారని తెలుస్తోంది. అయితే ఏం జరిగింది...అసలు కంటికి ఏ సమస్య వచ్చింది. ముంబైలో అంత పెద్ద డాక్టర్స్ ఉంటారు..అయినా ఎందుకు సెట్ కాలేదు అనేది బయిటకు రాలేదు. అప్పటికి బాలీవుడ్ మీడియా సంస్దలు షారూఖ్ మేనేజర్ పూజ డడ్లాని తో టచ్ లోకి వెళ్దామని చూస్తే ఆమె ఫోన్స్ కు, మెసేజ్ లకు రెస్పాండ్ కాలేదు.
వాస్తవానికి షారూఖ్ కు ఇప్పటికే 2014లో కంటి ఆపరేషన్ జరిగింది. కాగా మళ్లీ ఆ సమస్య పునరావృతం అయినట్లు తెలుస్తోంది. దాంతో ఇటీవలే UK నుండి వచ్చిన నటుడు షారుఖ్ ఖాన్ తన కంటి చికిత్స కోసం అత్యవసరంగా USA కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ కంటి సమస్యతో ముంబైలోని ఒక ఆసుపత్రికి వెళ్లగా చికిత్స నిమిత్తం ఆ డాక్టర్ అమెరికాకు రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. జూలై 30న షారూఖ్ తన కంటి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇక షారుక్ ఖాన్ (Shah Rukh Khan) మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయనకు రీసెంట్ గా అరుదైన గౌరవం దక్కింది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ (Locarno Film Festival) జ్యూరీ ఆయన్ను ‘కెరీర్ అఛీవ్‌మెంట్ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘షారుక్‌లాంటి లివింగ్ లెజెండ్‌ను ఆహ్వానించాలనే కల నెరవేరింది. ఆయనో సూపర్‌స్టార్. హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు’’ అని కొనియాడింది.
లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ 77వ ఎడిషన్ ఆగస్టు 7 నుంచి 17 వరకు లొకర్నో (స్విట్జర్లాండ్)లో జరగనుంది. 10న షారుక్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘దేవ్‌దాస్’ను ఆ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఆ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా షారుక్ నిలిచారు. ఇంతకుముందు ఫ్రాన్సిస్కో రోసీ, జానీ టో వంటి హాలీవుడ్ ప్రముఖులు ఆ పురస్కారానికి ఎంపికయ్యారు.
32 ఏళ్ల నట ప్రస్థానంలో షారుక్ 100కిపైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు. గతేడాది ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’లతో అలరించిన ఆయన ప్రస్తుతం సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ‘కింగ్’ టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం.
Sharukh Khan
షారుఖ్ తదుపరి యాక్షన్- థ్రిల్లర్ కింగ్‌లో అతని కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ తో కలిసి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా తీయబోయే టైగర్ వర్సెస్ పఠాన్‌లో కూడా ఖాన్ పఠాన్ పాత్రను తిరిగి పోషించనున్నట్లు ఇండస్ట్రీ టాక్ ఉంది.