MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pathaan Review: 'పఠాన్' ట్విట్టర్ రివ్యూ.. కింగ్ సైజ్ స్పై ఎంటర్టైనర్, ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్

Pathaan Review: 'పఠాన్' ట్విట్టర్ రివ్యూ.. కింగ్ సైజ్ స్పై ఎంటర్టైనర్, ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. భారీ అంచనాలు అంతకి మించిన వివాదాలతో నేడు బాక్సాఫీస్ ముందుకు వస్తోంది. బాలీవుడ్ బాద్షా చాలా రోజుల తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో రచ్చ చేస్తున్నాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 25 2023, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. భారీ అంచనాలు అంతకి మించిన వివాదాలతో నేడు బాక్సాఫీస్ ముందుకు వస్తోంది. బాలీవుడ్ బాద్షా చాలా రోజుల తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో రచ్చ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. షారుఖ్ కి జోడిగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తోంది. షారుఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ లుక్ , దీపికా హద్దుల్లేని గ్లామర్ షో ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మితిమీరిన గ్లామర్ ప్రదర్శన చేస్తూ అసభ్యంగా, అశ్లీలంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు అని హిందూ సంఘాలు, బిజెపి నేతలు ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పఠాన్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని కూడా పిలుపునిచ్చారు. కొన్నిచోట్ల పఠాన్ చిత్ర విషయంలో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్ అండ్ స్పై చిత్రాల దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. చాలా కాలంగా బాద్షా షారుఖ్ సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. షారుఖ్ పఠాన్ చిత్రంతో విజయం అందుకుంటాడు అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్విటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. 

38

'షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో.. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఈ చిత్రానికి 3 రేటింగ్ ఇస్తున్నా అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. పఠాన్ చిత్రం కింగ్ సైజ్ ఎంటర్టైనర్. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మనల్ని స్పై యూనివర్స్ లో ముంచి లేపుతారు. ఈ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలని అందుకుని విజేతగా నిలిచింది అంటూ మరో నెటిజన్ తన రివ్యూ తెలిపారు. 

48

వరల్డ్ లోనే పఠాన్ మొదటి షో ఆక్లాండ్ లో పడింది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ టాప్ నాచ్ లో ఉంది. ఇంటర్వెల్ సన్నివేశంలో సస్పెన్స్ అదిరిపోయింది అంటూ మరో ప్రేక్షకుడు తన స్పందన తెలిపారు. 

 

58

యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. కింగ్ ఈజ్ బ్యాక్. షారుఖ్ ఖాన్ ఇంట్రడక్షన్ మంటలు రేపే విధంగా ఉంది. బ్లాక్ బస్టర్ లోడింగ్. పఠాన్ ఫస్ట్ హాఫ్ మంచి ట్విస్ట్ లతో ఎంగేజింగ్ గా ఉంది. విఎఫెక్స్ వర్క్, బిజియం కూడా ఆకట్టుకుంటున్నాయి అని కొందరు నెటిజన్లు పఠాన్ చిత్రంపై రివ్యూ ఇస్తున్నారు. 

68

ఫస్ట్ హాఫ్ సుపర్బ్ గా ఉంది. షారుఖ్ తో పాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొనె పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ ని యాక్షన్ సీన్స్ మాత్రమే నిలబెట్టాయి. ఓవరాల్ గా ఇది షారుఖ్ ఖాన్ కి మాత్రమే కాదు.. బాలీవుడ్ కి కూడా కంబ్యాక్ అని ప్రేక్షకులు అంటున్నారు. 

78

పఠాన్ ఫస్ట్ హాఫ్ స్లో అండ్ స్టడీగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. క్రిస్ప్ రన్ టైంతో ఫస్ట్ హాఫ్ ని ఎంగేజింగ్ గా తీర్చిదిద్దారు. షారుఖ్ పాత్ర అద్భుతం. జాన్ అబ్రహం, దీపికా పదుకొనె ఈ చిత్రానికి మంచి చాయిస్. సెకండ్ హాఫ్ కోసం వైటింగ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. 

88

పఠాన్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయి. కానీ చిత్రీకరించిన విధానం హాలీవుడ్ లెవల్ లో ఉంది అని మరో నెటిజన్ తన అభిప్రాయం తెలిపారు. పఠాన్ చిత్రంలో దీపికా పదుకొనె వాల్కేనో తరహా గ్లామర్ తో వేడి పుట్టిస్తోంది. షారుఖ్, దీపికా మధ్య కెమిస్ట్రీ బావుంది. జాన్ అబ్రహం బ్యాడీగా అదరగొట్టాడు. ఓవరాల్ గా కింగ్ ఖాన్ కి ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ అని ప్రేక్షకులు తమ స్పందన తెలుపుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved