- Home
- Entertainment
- 25 ఏళ్లుగా టాప్ హీరో అతనే, IMDb రిలీజ్ చేసిన 25 సినిమా లో 7 ఆయనవే, ఇంతకీ ఎవరా హీరో ?
25 ఏళ్లుగా టాప్ హీరో అతనే, IMDb రిలీజ్ చేసిన 25 సినిమా లో 7 ఆయనవే, ఇంతకీ ఎవరా హీరో ?
IMDb గత 25 ఏళ్ళుగా బాలీవుడ్ స్టార్ల పాపులారిటీని అంచనా వేస్తూ.. టాప్ యాక్టర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 2000 నుంచి 2025 వరకు ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీలు, సినిమాలు ఏవో తెలుసా? టాప్ హీరో ఎవరు?

25 ఏళ్ల లిస్ట్ రిలీజ్ చేసిన IMDb
ఇండియన్ సినిమాలో కథ, కంటెంట్ కంటే స్టార్ ఇమేజ్, వారి పాపులారిటీ ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సినిమాలు స్టార్ క్రెడిబిలిటీతోనే హిట్ అవుతాయి. సల్మాన్ ఖాన్ చాలా సినిమాల్లో కథ కంటే అతని స్టార్‌డమ్ కి, ఎలివేషన్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. సల్మాన్ అనే కాదు, బాలీవుడ్ హీరోలు, సౌత్ హీరోల సినిమాల్లో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
షారుఖ్ ఖాన్ పాపులారిటీ
గత 25 ఏళ్లలో సూపర్ స్టార్ల నటన కంటే వారి క్రెడిట్, ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాలను హిట్ చేశాయి. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో గత 25 ఏళ్ల (2000 నుంచి 2025) టాప్ సినిమాలు, ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల గురించి పూర్తి వివరాలను ఆ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
అమీర్ ఖాన్‌ను వెనక్కి నెట్టిన షారుఖ్
ఈ 25 సంవత్సరాల్లో షారుఖ్ ఖాన్ తన సమకాలీకులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో పాటు అమితాబ్ బచ్చన్‌ను కూడా వెనక్కి నెట్టారు. కింగ్ ఖాన్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా నిలిచారు. 60 ఏళ్ల వయసులోనూ షారుఖ్ ఎంతో చురుగ్గా ఉండటమే కాదు, ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ హీరోగా ఎదిగాడు.
అందరికంటే ముందున్న కింగ్ ఖాన్
IMDb మోస్ట్ ప్రొలిఫిక్ జాబితా ప్రకారం, జనవరి 2000 నుంచి ఆగస్టు 2025 మధ్య విడుదలైన సినిమాలను చేర్చారు. ప్రతి సంవత్సరం నుంచి 5 సినిమాలు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలకు 91 లక్షలకు పైగా యూజర్ రేటింగ్స్ వచ్చాయి. ఈ జాబితాలోని 20 సినిమాల్లో షారుఖ్ ఖాన్ ఉన్నారు. వాటిలో 7 సినిమాల్లో ఆయన లీడ్ యాక్టర్, కొన్నింటిలో అతిథి పాత్ర, మరికొన్నింటిని రెడ్ చిల్లీస్ నిర్మించింది. అందుకే ఆయన తన తోటి హీరోలందరిని మించి సాధించారు.
సత్తా చాటిన షారుఖ్ సినిమాలు ఇవే
IMDb జాబితా ప్రకారం, 2000-2005 మధ్య ఉత్తమ చిత్రాలలో 2000లో 'మొహబ్బతే', 2001లో 'కభీ ఖుషీ కభీ గమ్', 2002లో 'దేవదాస్', 2003లో 'కల్ హో నా హో', 2004లో 'వీర్ జారా' టాప్ ర్యాంకింగ్ సాధించాయి. 2008లో 'రబ్ నే బనా ది జోడి', 2010లో 'మై నేమ్ ఈజ్ ఖాన్' కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
అత్యంత పాపులర్ నటుడు
జనవరి 2014 నుంచి ఏప్రిల్ 2024 వరకు షారుఖ్ ఖాన్ పాపులారిటీ నిరంతరం పెరిగింది. గత 25 ఏళ్లలో విడుదలైన 130 అగ్ర చిత్రాలలో 20 సినిమాల్లో కింగ్ ఖాన్ ప్రధాన నటుడు. కొన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు విడుదల కాకపోయినా, వార్తల్లో నిలిచారు. ఈ సమయంలో ఆయన IMDb వీక్లీ టాప్ 10 సెలబ్రిటీల జాబితా నుంచి బయటకు వెళ్లలేదు.