MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 8: హౌజ్‌లోకి ఒకప్పటి స్టార్‌ హీరో.. అంత మంది సీనియర్లా? పెద్ద రిస్కే ?

Bigg Boss Telugu 8: హౌజ్‌లోకి ఒకప్పటి స్టార్‌ హీరో.. అంత మంది సీనియర్లా? పెద్ద రిస్కే ?

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8 ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో పలు విషయాలు షాకిస్తున్నాయి. సీనియర్ల తాకిడి ఎక్కువగా ఉంటుందట.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 22 2024, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 8 Logo

Bigg Boss Telugu 8 Logo

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభానికి టైమ్‌ అవుతుంది. మరో నెలన్నర రోజుల్లో కొత్త సీజన్‌ ప్రారంభం కాబోతుంది. లేటెస్ట్ గా ఈ సీజన్‌కి సంబంధించిన టైటిల్ లోగో ప్రోమో కూడా వచ్చింది. లోగో ఎలా ఉండబోతుందో అనేది నాగ్‌ ప్రకటించారు. త్వరలోనే షో స్టార్ట్ కాబోతుందని తెలిపారు. ఈ సారి లోగో చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. లోగో మధ్యలో పువ్వు సింబల్‌ స్పెషల్‌గా ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

బిగ్‌ బాస్‌ షోలో ట్విస్ట్ లు, టర్న్ లు పెడుతున్నారు నిర్వహకులు. అవి లేకుండా రేటింగ్‌ రావడం లేదు. క్రేజీ విషయాలు జరిగితేనే, బాగా గొడవలు అయితేనే మంచి రేటింగ్‌ వస్తుంది. గత సీజన్‌లో అదే జరిగింది. అంతకు ముందు సీజన్‌ చాలా చప్పగా సాగింది. పెద్దగా రేటింగ్‌ రాలేదు. దీంతో రూట్‌ మార్చారు నిర్వాహకులు. హడావుడి చేస్తున్నారు. గత సీజన్‌లో రెండుసార్లు లాంఛింగ్ ఈవెంట్లు పెట్టి అందరిని షాక్‌కి గురి చేశారు. అదే సమయంలో కామన్‌ మ్యాన్‌ ఫ్యాక్టర్‌ కూడా బాగా వర్క్ అవుతుంది. 
 

37
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఈ సారి సరికొత్తగా ఉండబోతుందట. ఎవరూ ఊహించని విషయాలు జరగబోతున్నాయట. అవన్నీ సస్పెన్స్ లో పెట్టారు. అదే సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సారి కంటెస్టెంట్లకి సంబంధించిన వివరాలు షాకిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా సీనియర్లే కనిపిస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. గత సీజన్‌లో షకీలా, కిరణ్‌ రాథోడ్‌, శివాజీ సీనియర్లు ఉన్నారు. ఇద్దరు సీనియర్లని ప్రారంభంలోనే పంపించారు. శివాజీ బాగా కంటెంట్‌ ఇచ్చి ఫైనల్‌ వరకు ఉన్నాడు. 
 

47
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కానీ ఈ సారి యంగ్ స్టర్స్ కంటే సీనియర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కుమారీ అంటీ, నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది. అలాగే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారే సురేఖవాణి పేరు వినిపిస్తుంది. కిరాక్‌ ఆర్పీ వస్తున్నాడట. సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీరితోపాటు బర్రెలక్క, యూట్యూబర్‌ బంచిక్‌ బబ్లు, సోనియా సింగ్‌, బుల్లెట్‌ భాస్కర్‌, రీతూ చౌదరి, వర్షిణి సుందరాజన్‌, క్రికెటర్‌ అంబటి రాయుడు, యూట్యూబర్‌ అమృత ప్రణయ్‌, కన్నడ నటి ప్రేరణ ఖన్నా వస్తున్నారట. అలాగే నటి తేజస్విని, యాంకర్‌ వింధ్యా, శ్వేతా నాయుడు, అంజలి, ఇంద్రనీల్‌ వర్మ, కమెడియన్‌ సద్దాం, సీనియర్‌ హీరో శివకుమార్‌, మై విలేజ్‌ షో అనిల్‌, కుషిత కల్లాపు, సుప్రీత, యూట్యూబర్‌ శీతల్‌ గౌతమ్,యువ సామ్రాట్‌, సీనియర్‌ నటి సన, మోడల్‌ ఊర్మిళ చౌహాన్‌ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. 
 

57

ఈ లిస్ట్ లో ఒకప్పటి స్టార్‌ వినోద్‌ కుమార్‌ పేరు కూడా తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. ఆయన ఒకప్పుడు కన్నడ, తెలుగులో హీరోగా అనేక సినిమాలు చేశారు. పెద్ద హీరోలకు దీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.  చాలా కాలం దూరమయిన ఆయన మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఇటీవల `రాజధాని ఫైల్స్` సినిమాతో మళ్లీ మెరిశారు. నటుడిగా కమ్‌ బ్యాక్‌ అయ్యే క్రమంలో మంచి గుర్తింపు కోసం ఆయన బిగ్‌ బాస్‌ షోకి వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సారి గ్లామర్‌ పాళ్లు బాగానే ఉన్నాయి. కానీ సీనియర్ల తాకిడి పెరిగింది. గతంతో పోల్చితే ఇందులో ఎక్కువగా సీనియర్లే కనిపిస్తున్నారు.  

67
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సీనియర్‌ ఆర్టిస్టులు ఉంటే గేమ్‌ సరిగా ఆడరు, కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప, గేమ్‌ ఉండదు, అది షోని నిరసంగా మార్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ నాగార్జునకు తెలియనిది కాదు.  యంగ్‌ కుర్రాళ్లు, అమ్మాయిలు ఉంటేనే నాగ్‌ బాగా మసాలా కలుపుతాడు. షోని రక్తికట్టిస్తాడు. సీనియర్లు అయితే రెస్పెక్ట్ తోనే టైమ్‌ పోతుంది. ఇక గేమ్‌, టాస్క్ లు కూడా మజా ఉండవు. మరి ఈ వార్తల్లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్‌ మొదటివారంలోనే ఈ ఎనిమిదో సీజన్‌ బిగ్‌ బాస్‌ షోని ప్రారంభించబోతున్నారు నిర్వహకులు. 

77

కన్నడకి చెందిన వినోద్‌ కుమార్‌.. కన్నడలో స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. `కర్తవ్యం`, `మామగారు`, `భారత్‌ బంద్‌`, `సీతారత్నంగారి అబ్బాయి`, `గ్యాంగ్‌వార్‌` వంటి చిత్రాల్లో చేశారు. దాసరి నారాయణరావుతో ఎక్కువ మూవీస్‌ చేశారు.  ఇటీవల తెలుగులోనూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ ఆయనకు సరైన గుర్తింపు లేదు. ఈ క్రమంలో తన పాపులారిటీని పెంచుకునేందుకు బిగ్‌ బాస్ కి వస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved