చిరునవ్వులతో చిలిపి బాణాలు వేస్తోన్న సదా, కుర్రాళ్ల గుండెల్లో నవ్వుల బాణాలు వేస్తోంది..
సినిమా అవకాశాలు లేకపోవడంతో.. బుల్లితెరపైమెరుస్తోంది.. సీనియర్ హీరోయిన్ సదా. స్మాల్ స్క్రీన్ షోస్ కు జడ్జిగా సందడి చేస్తోంది. అటు సోషల్ మీడియాలో ఏమాత్రం గ్యాప్ లుకుండా తన ఫోటో షూట్లతో అదరగొడుతోంది.
ఈ ఏజ్ లో కూడా మాత్రం వన్నెతగ్గడంలేదు సదా. 40 ఏళ్లు వస్తున్నా.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చయేలా గ్లామర్ ఫోటో షూట్లతో అదరగోటుతోంది.
బుల్లితెరపై సదా ఫుల్ బిజీ బిజీ అవుతుంది. వరుసగా షోలకు ఆమెను జర్జ్ గా తీసుకుంటున్నారు. తాజాగా ఆమె జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణభగవాన్ తో పాటు జడ్జిగా ఆమె ఒక ఎపిసోడ్ లో కనిపించింది. సదా జడ్జిగా రావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కలర్ ఫుల్ గా మారింది.
ప్రస్తుతం సదా స్టార్ మాలో నీతోనే డాన్స్ పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షోకి జడ్జిగా సదా వ్యవహరిస్తోంది. ఇక ఈ పనులు చేసుకుంటూపే.. ఫోటో షూట్లతో అదరగొడుతోంది బ్యూటీ... తన గ్లామర్ ను రెట్టింపు చేసేవిధగా డ్రస్ లు వేసుకుంటూ.. నెట్టింట్లో రచ్చ చేస్తోంది.
గతంలో పాపులర్ డాన్స్ షో Dhee14కి జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకుంది సదా. స్మాల్ స్క్రీన్ పై అందాలను ఆరబోస్తూ.. రోజుకో ఫోటో షూట్ తో ... ట్రెండీ, ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
దాదాపు నాలుగైదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది సదా... పెళ్లి చేసుకోకుండా మోస్ట్ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే సదాకు రాను రాను అకాశాలు తగ్గడం.. చివరిగా వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో... వెండి తెరకు గ్యాప్ ఇవ్వక తప్పలేదు. ఇక రీ ఎంట్రీని కాస్త గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంది బ్యూటీ.
ఇక సదా నటించిన చివరి సినిమా టార్చ్ లైట్.ఈ సినిమా లో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది సదా. కాని ఈసినిమా నిరాశనరిచింది. అంతే కాదు ఆతరువాత నుంచి సినిమాలపై సదా ప్రభావం పెద్దగా లేదు.. ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రంసదా అద్భుతం చేస్తోంది. ఏమాత్రంతగ్గకుండా హాట్ హాట్ అందాలు వడ్డిస్తోంది.