నెటిజన్ కు ప్రియమణి చురకలు, నేను చాలా హాట్ అంటూ.. కౌంటర్ ఇచ్చి.. నోరు మూయించిన సీనియర్ బ్యూటీ
సినిమా తారలపై.. ముఖ్యంగా హీరోయిన్లపై నెటిజన్ల ట్రోలింగ్, కౌంటర్లు.. రీ కౌంటర్లు.. ఇవన్నీ కామన్. నెటిజన్లు వేసే పంచ్ లకు.. కొంత మంది స్టార్లు గట్టిగానే కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా సీనియర్ నటి ప్రియమణికి కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంస్కృతి కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా తారలపై ఎడాపెడా ట్రోలింగ్స్ చేయడం.. కౌంటర్లు వేయడం, విమర్షలు గుప్పించడం ఎక్కువైపోయింది. పెళ్లైన హీరోయిన్లు అని కూడా చూడకుండా.. ఒక్కోసారి వారిపై కూడా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వారు పెట్టే పోస్ట్ లకు పాజిటీవ్ గా స్పందించేవారు కొందరైతే.. ట్రోలింగ్ చేసేవారు కొందరు. తాజాగా ప్రియమణి కి కూడా ఓ నెటిజన్ షాక్ ఇచ్చాడు.
ఈమధ్య సోషల్ మీడియాలో ఆంటీ కామెంట్లు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ కూడా ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నది. ‘అనసూయ ఆంటీ’ అంటూ ఆమెను సోషల్ మీడియాలో చాలా కాలం వేధించారు ఆకతాయి నెటిజన్లు.. అయితే అనసూయ కూడా ఎక్కడా తగ్గలేదు. వారిని గట్టిగా ఎదుర్కొంది. ఘాటుగా ట్రోలర్స్ కు సమాధానం చెప్పేది.ఇక ఇప్పుడు ఈ విషయంలో ప్రియమణి వంతు వచ్చింది.
తాజాగా ప్రియమణిని కొందరు కొంటె నెటిజన్లు ఆంటీ అని కామెంట్ చేయడంతో నెట్టింట్ల రచ్చమొదలయ్యింది. ప్రియమణి సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ‘బ్లాక్ ఆంటీ’ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయిత వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఈక్రమంలో తాజాగా మరోసారి ప్రియమణిని ఆంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దాంతో ఈసారి మాత్రం ఆమె స్పందించింది. తన మార్క్ కౌంటర్ కూడా ఇచ్చింది.
ఆంటీ అన్న కామెంట్స్ ను చూసి చూసి విసుగొచ్చింది ప్రియమణికి. దాంతో.. ఆంటీ అన్న ఓ నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రియమణి. “ప్రస్తుతం నా వయసు 38 ఏళ్లు. అయినా హాట్ గానే ఉన్నాను. ఇక నోరు మూసుకో” అంటూ చాలా తక్కువ పదాలలో.. ఘాటు సమాధానం చెప్పింది. అయితే తాను ఇలాంటి కామెంట్స్ ను చాలా పాజిటివ్ గా తీసుకుంటానని వెల్లడించింది ప్రియమణి.
అంతే కాదు నన్ను ఆంటీ అని కామెంట్ చేయటంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవచ్చు. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదు. వయసు పెరగడం అనేది సహజ సిద్ధంగా జరిగే పక్రియ అని చెప్పుకొచ్చింది. ప్రియమణి పాజిటివ్ స్పందనపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించడం బాగుందంటున్నారు.
ఇక ప్రిమమణి సమాధానానికి.. ఆమె ఆలోచన తీరుకు అందరు ఫిదా అయ్యారు. అంత నెగిటివ్ కామెంట్లను కూడా పాజిటివ్ తీసుకుని ప్రియమణి చేసిన కామెంట్స్ , ఆమె స్పందించిన తీరు.. ఆమెలోని గొప్పతనాన్ని, మంచిమనసును చూపిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు ఇలా మాట్లాడే ధైర్య కూడా ఎవరికి ఉండదంటున్నారు.
ఇక ప్రియమణి టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. దాదాపు పదేళ్ళు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగులో స్టార్ హీరోలు అందిరితో కలిసి నటించింది ప్రియమణి. మంచి కథలు ఉన్న సినిమాలు ఎంచుకుని.. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేసింది. టాలీవుడ్ లో మంచి గుర్తుంపు సాధించింది. అవ్వడానికి మలయాళ అమ్మాయే అయినా.. తెలుగించి ఆడపడుచులా కనిపిస్తుంది ప్రియమణి.
కెరీర్ కాస్త డల్ అయిన టైమ్ లో ముస్తఫా అనే వ్యక్తిని.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని.. సినిమాలకు చాలా కాలం బ్రేక్ ఇచ్చింది ప్రియమణి. ఈ మధ్య మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో మిడిల్ క్లాస్ వైఫ్ గా నటించి ఆకట్టుకుంది. అటు బుల్లితెరపై ఢీ లాంటి డాన్స్ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది.
Priyamani
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తూ వస్తోన్న ప్రియమణి తాజాగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో నటించింది. షారుఖ్ కు సాయం చేసే ఆరుగురు అమ్మాయిల్లో ప్రియమణి ఒకరుగా కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు చక్కటి గుర్తింపు లభించింది.