MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీనియర్ హీరోయిన్ ఖుష్బుకు చేదు అనుభవం, సోషల్ మీడియా వేదికగా మండిపడిన తమిళ స్టార్

సీనియర్ హీరోయిన్ ఖుష్బుకు చేదు అనుభవం, సోషల్ మీడియా వేదికగా మండిపడిన తమిళ స్టార్

సౌత్ సీనియర్ యాక్ట్రస్..మాజీ హీరోయిన్ ఖుష్బుకు అవమానం జరిగింది. చెన్నై ఏయిర్ పోర్ట్ లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందిని సోషల్ మీడియా వేదికగా కడిగిపడేసింది కుష్బు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 02 2023, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ సీనియర్ నటి ఖుష్బు తనకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైందని.. వీల్ ఛైర్ కోసం తనను ఇబ్బంది పెట్టారంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఒక సెలబ్రిటీకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అంటూ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఇంతకీ కుష్భుకు జరిగిన అవమానం ఏంటీ..? ఎందుకు వైరల్ గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సౌత్ సినిమాలో ముఖ్యంగా తెలుగు, తమిళ తెరపై ఒక వెలుగు వెలిగింది ఖుష్బు. సీనియర్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది బ్యూటీ. ఆమె మీద ప్రేమతో తమిళ నాట ఖుష్బు ఫ్యాన్స్  ఏకంగా గుడి కట్టారంటే ఆమె ఇమేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ విషయం సెన్సేషన్ కూడా అయ్యింది. ఈ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు మాజీ హీరోయిన్. 
 

37
Kushboo

Kushboo

ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా  కుష్బుకు మంచి మంచి పాత్రలు పడుతున్నాయి. హీరో మదర్ గా నటిస్తున్నా.. గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గగడంలేదు ఖుష్బు. అటు స ినిమాల్లో నటిస్తూనే..  తమిళనాట రాజకీయాల్లో కూడా ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బు.

47
kushboo

kushboo

ఇక ఆమెకు చెన్నై ఏయిర్ పోర్ట్ లో అవమానం జరిగినట్టు సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది ఖుష్బు.  తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. తన కాలు బాగోలేక వీల్‌ చైర్‌ కావాలని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని కోరాను. 30 నిమిషాలు వెయిట్‌ చేసినా కూడా అది రాలేదు. అరగంట పాటు నేను కాలు నొప్పిని భరిస్తూనే ఎదురు చూశాను. తర్వాత.. వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్‌చైర్‌లో నన్ను పంపించారు.  
 

57

అసలు ఏంజరుగుతుంది అక్కడ... ఎయిర్‌ ఇండియా సంస్థకు కనీసం ఒక వీల్‌చైర్‌ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా..? ఇంత దారుణం ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదంటూ..  అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఖుష్బు. ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలు గా స్పందిస్తున్నారు కూడా. 

67

ఇక ఆమె సినిమా కెరీర్ విషయానకి వస్తే.. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఖుష్బు. హీరోయిన్ గా వరుస సినిమాలు నటిస్తూ.. బిజీగా గడిపేసింది. తరువాత కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ ను పెళ్ళాడి కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది బ్యూటీ. 

77

మధ్య కాలంలో వెయిట్‌ లాస్‌ అయ్యి.. యంగ్‌ లుక్‌లోకి మారిపోయి.. కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్  అజ్ఞాతవాసి తర్వాత శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ నటించి మెప్పించారు. అంతే కాదు జబర్థస్త్ జడ్జిగా కూడా బుల్లితెరపై నవ్వుులు పూయిస్తుంది ఖుష్బు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved