ఛార్మి పెళ్ళి చేసుకోపోవడానికి కారణం అతనేనా...? ఆమెను నమ్మించి మోసగించింది ఎవరు...?
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కూడా ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూరీతో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అయితే ఛార్మి ఇప్పటి వరకూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? ఇది ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. మరి దీనికి సమాధానం ఏంటీ..?
2002లో నీతోడుకావాలని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ ఛార్మీ. అయితే ఈ సినిమా అంత హిట్ అవ్వలేదు కాని.. ఛార్మి మాత్రం టాలీవుడ్ లో పాతుకుపోయింది. ఆతరువాత వరుసగా మంత్ర, పౌర్ణమి, చక్రం, శ్రీఆంజనేయం, మాస్, చిన్న లాంటి సినిమాలతో ఛార్మికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసింది బ్యూటి.
టాలీవుడ్ లో జూనియర్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ స్టార్ హీరోలతో కూడా జోడీ కట్టి.. చాలా తక్కువ టైంలోనే తన హాట్‌నెస్, నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది చిన్నది. ఇక ఛార్మి ఫామ్ కోల్పోతున్న టైమ్ లో జ్యోతిలక్ష్మీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తరువాత ఛార్మి జర్నీ..పూరీతో పాటు కొనసాగుతుంది.
జ్యోతిలక్ష్మీ సినిమా తరవాత ఛార్మికి మళ్లీ సరైన హిట్ పడలేదు. ఈ సినిమా టైమ్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిచయంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు ఇద్దరు. ఇక అప్పటి నుండి ఛార్మి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. కంప్లీట్ గా నటనను వదిలేసింది.
ఇదిలా ఉంటే.. ఛార్మి వయసు ప్రస్తుతం 35 ఏళ్లు అయినా.. ఇంకా పెళ్లి గురించి ఆలోచించడంలేదు సీనియర్ బ్యూటీ. పెళ్లికి దూరంగానే ఉంటూ వస్తోంది. ఎవరు ప్రశ్నించినా..పెళ్ళి టాపిక్ మాత్రం తీసుకురావద్దు అంటోంది. దీనికి కారణం తన లైఫ్ లో ఉన్న ఓ విషాద ప్రేమే.. అని సమాచారం.
అప్పట్లో ఛార్మి ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలు బయట పెట్టింది. తాను ఇప్పటికే ఒకడిని నమ్మి మోసపోయానని… అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్పింది.అయితే అప్పట్లో ఛార్మి ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపించిందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. రాను రాను ఆ టాపిక్ కనుమరుగు అవుతూ వచ్చింది.
ఆ మ్యూజిక్ డైరెక్టర్ తనను పెళ్ళి చేసుకుంటాడు అన్న నమ్మకంతో ఛార్మి అతనికి తన సర్వస్వం అర్పించుకుందట. కాని అతను పెళ్ళి చేసుకోకపోవడంతో .. విరక్తితో అతడి వల్లే ఛార్మి పెళ్లి దూరమైందన్న గుసగుసలు టాలీవుడ్‌లో వినిపించాయి. ఇక ఇప్పుడు కంప్లీట్ గా సినిమాల నిర్మాణం పైనే దృష్టి పెట్టిందట ఛార్మి. పెళ్ళి అంటే నో అంటోందట.
ఇక ప్రస్తుతం పూరీతో కలిసి జర్నీ చేస్తోంది ఛార్మి. పూరీ, ఛార్మి కలిసి రామ్ హీరోగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరవాత పూరి దర్శకత్వంలో వచ్చిన మరికొన్ని సినిమాలకు కూడా ఛార్మి నిర్మాతగా వ్యవహించింది. ఇక ఇప్పుడు ఏకంగా లైగర్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో పాటు.. పూరి, ఛార్మి కలిసి నిర్మించారు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది మూవీ.