Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,

కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణమే అయినా… కొన్ని కథనాలు ఎప్పటికీ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. అలాంటిదే ఈ న్యూస్. ఓ సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్  3 పెళ్లిళ్లు చేసుకుంది. ఇక ఆమె తండ్రి ఏకండా 5 పెళ్లిల్లు చేసుకున్నారు. ఇంతకీ ఎవరావిడి. 

Mahesh Jujjuri | Published : May 14 2025, 04:08 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాధికా సినీ ప్రస్థానం ఎంతో  అద్భుతం.   కానీ ఆమె వ్యక్తిగత జీవితం సినిమాలను మించిన ట్విస్ట్ లతో మహాద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

25
Actress Radhika sarathkumar

Actress Radhika sarathkumar

రాధికా మొదటి పెళ్లి ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్‌తో జరిగింది. అయితే, వీరి వివాహం కొంతకాలం తర్వాత విడాకులతో ముగిసింది. అనంతరం ఆమె రిచర్డ్ హార్డిని వివాహం చేసుకున్నారు. ఈ సంబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. చివరికి రాధికా శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. శరత్ కుమార్‌కి ఇది రెండో వివాహం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తమిళ సినీ రాజకీయ రంగాల్లో ప్రముఖులుగా కొనసాగుతున్నారు.
 

Related Articles

రాధిక కనిపిస్తే చాలు రజినీకాంత్ చెప్పులు చూసుకుంటారట,  సూపర్ స్టార్ ఎందుకు ఇలా చేస్తారో తెలుసా?
రాధిక కనిపిస్తే చాలు రజినీకాంత్ చెప్పులు చూసుకుంటారట, సూపర్ స్టార్ ఎందుకు ఇలా చేస్తారో తెలుసా?
శ్రీలంకలో పుట్టి చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ గా ఎదిగింది.. క్రేజీ హీరోయిన్ ఆస్తుల వివరాలు
శ్రీలంకలో పుట్టి చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ గా ఎదిగింది.. క్రేజీ హీరోయిన్ ఆస్తుల వివరాలు
35
Asianet Image

రాధికా కుటుంబ నేపథ్యం కూడా విశేషమే. ఆమె తండ్రి ఎంఆర్ రాధ తమిళ సినీ రంగంలో సుపరిచిత నటుడు. ఆయన ఏకంగా ఐదు వివాహాలు చేసుకున్నారు. ఆయనకు 12 మంది సంతానం ఉన్నారు. శ్రీలంక మహిళ గీతతో ఆయనకు జన్మించిన సంతానమే రాధికా. రాధికాకు నిరోష అనే చెల్లి కూడా ఉన్నారు.
 

45
Asianet Image

సినిమాలతో పాటు రాధికా టెలివిజన్ రంగంలోనూ గొప్ప విజయాలు సాధించారు. ముఖ్యంగా తల్లి పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. మెగాస్టార్ చిరంజీవితో రాధికా కలయిక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కనిపించింది.

55
Radhika

Radhika

ఈ విధంగా, సినిమాలలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ రాధికా అనేక మలుపులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఘనత చెందిన నటి. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories