MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అర్ధరాత్రి కక్కుర్తి గాళ్ళు తలుపు తట్టేవారు, క్యాస్టింగ్ కౌచ్ పై అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్!

అర్ధరాత్రి కక్కుర్తి గాళ్ళు తలుపు తట్టేవారు, క్యాస్టింగ్ కౌచ్ పై అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్!

సీనియర్ నటి అన్నపూర్ణ క్యాస్టింగ్ కౌచ్ పై గతంలో సంచలన కామెంట్స్ చేశారు. అవుట్ డోర్ షూటింగ్స్ లో అర్ధరాత్రి తలుపులు తట్టి వేధించేవారని ఆమె అన్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 07 2024, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Annapurna

Annapurna

టాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు అన్నపూర్ణ. ఆమెను అందరూ అన్నపూర్ణమ్మ అంటారు. తనకంటే వయసులో పెద్దవారైన నటులకు కూడా ఆమె అమ్మగా నటించారు. చివరికి ఎన్టీఆర్ కి కూడా అన్నపూర్ణ అమ్మగా చేయడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం తనకు అమ్మగా నటించడానికి ఒప్పుకునే వారు కాదట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Annapurna

Annapurna

అమ్మ పాత్ర అంటే మొదట గుర్తొచ్చే పేరు అన్నపూర్ణ. వందల చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఆమె అమ్మగా చేయని హీరో ఉండరు. కృష్ణ, శోభన్ బాబు కూడా అన్నపూర్ణ కంటే వయసులో పెద్దవారే. వారికి కూడా అమ్మ తల్లిగా నటించి మెప్పించారు. ఇక చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలకు ఆమె అనేక చిత్రాల్లో తల్లిగా కనిపించారు. 

అమ్మ పాత్రలకు ఆమె అంతగా ఫేమస్. అయితే అలాంటి నటి కూడా లైంగిక వేధింపులు తప్పలేదట. కాగా కెరీర్లో ఆమెకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కీలక ఆరోపణలు చేశారు. 
 

36
Annapurna

Annapurna

నాలుగు దశాబ్దాల కెరీర్లో ఆమె చిత్ర పరిశ్రమను వడపోశారు. రకరకాల మనుషులను చూశారు. కొన్నాళ్లుగా ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందించారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదని ఆమె కుండబద్దలు కొట్టారు. 

ఓ సందర్భంలో అన్నపూర్ణ మాట్లాడుతూ... తప్పు అనేది ఒకరివైపే ఉండదు. ఇద్దరిది ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉంటుంది. కుటుంబ పరువు, మర్యాద కోసం మహిళలు వేధింపుల నుండి తెలివిగా తప్పించుకుంటున్నారు. అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ లైంగిక వేధింపులు తప్పవు.. అని అన్నారు. 

46

అలాగే తనకు ఎదురైన అనుభవాలు అన్నపూర్ణ వెల్లడించారు. అప్పట్లో అవకాశాలు ఇవ్వాలంటే వేధించేవాళ్ళు. ఆఫర్ ఇస్తే మాకేంటి అనేవారు. అందుకే నేను 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 25 ఏళ్లకు అమ్మ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాను. మదర్ రోల్స్ చేయడం మొదలెట్టాక లైంగిక వేధింపులు తగ్గాయి. 

షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా రూమ్ తలుపులు కొట్టేవారు. ఎయిడ్స్ మహమ్మారి  వచ్చాక లైంగిక వేధింపులు తగ్గాయి. ఎవరికి ఎయిడ్స్ ఉందో అని భయపడి లైంగికంగా వేధించడం మానేశారు. ఎయిడ్స్ వచ్చి మంచి పని అయ్యింది. ఒక్కోసారి చెడు వలన కూడా మంచి జరుగుతుంది... అని అన్నారు. 

56

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన మహిళల్లో శ్రీరెడ్డి ఒకరు. ఆమె పలువురు టాలీవుడ్ సెలెబ్స్ ప్రైవేట్ ఫోటోలు, సోషల్ మీడియా చాటింగ్ లో బయటపెట్టింది. అవకాశాల పేరిట తనను శారీరకంగా వాడుకున్నారని ఆమె కీలక కామెంట్స్ చేసింది. మా సభ్యత్వం, అవకాశాలు ఇవ్వనందుకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. 

ఇటీవల కేరళ చిత్ర పరిశ్రమను జస్టిస్ హేమ రిపోర్ట్ కుదిపేసింది. మాలీవుడ్ లో మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, అన్యాయాలపై జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళలు కెరీర్ కోసం వేధింపులను బయటపెట్టడం లేదని నివేదికలో పేర్కొంది. దిగ్భ్రాంతికర విషయాలు జస్టిస్ హేమ రిపోర్ట్ లో ఉన్నాయి. 
 

66
Jani Master National Award

Jani Master National Award

తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన చిత్ర ప్రముఖుల పేర్లు కొందరు నటులు బయటపెట్టారు. వారిపై కేసులు నమోదయ్యాయి. ఇక టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ప్రకంపనలు రేపింది. లేడీ అసిస్టెంట్ జానీ మాస్టర్ తనను చాలా కాలం పాటు లైంగిక వేధించాడని కేసు పెట్టింది. మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

పరారీలో ఉన్న జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. జానీ మాస్టర్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు రాగా.. ప్రభుత్వం రద్దు చేసింది. 
 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved