MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Rip Jamuna: ఆ స్టార్ హీరోని ప్రేమించిన జమున... ఎస్వీర్ హెచ్చరించడంతో బ్రేకప్!

Rip Jamuna: ఆ స్టార్ హీరోని ప్రేమించిన జమున... ఎస్వీర్ హెచ్చరించడంతో బ్రేకప్!

 జమున ఓ హీరోని ప్రేమించారనే పుకారు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఈయన అప్పట్లో రొమాంటిక్ హీరోగా వెలుగొందారు. పౌరాణిక పాత్రలకు కూడా చక్కగా సరిపోయేవాడు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 27 2023, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోయారు సావిత్రి, జమున. సావిత్రి టాప్ యాక్ట్రెస్ గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేవారు. ఆమె తర్వాతి స్థానం జమునదే. ఆ రోజుల్లో హీరోయిన్స్ అంటే పట్టుమని పది మంది ఉండేవాళ్లు. వాళ్ళతోనే హీరోలు రిపీటెడ్ గా సినిమాలు చేసేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సావిత్రి మాదిరి జమున కూడా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన జమున అన్ని రకాల పార్శ్వాలు చక్కగా పండించేవారు. చిత్ర పరిశ్రమకు రావడంలో సావిత్రి పాత్ర ఎంతగానో ఉంది. అందుకే సావిత్రి అంటే అమితమైన అభిమానం కలిగి ఉండేవారు జమున. సావిత్రిని అక్క అని జమున ఆప్యాయంగా పిలిచేవారట. సావిత్రి లైఫ్ లోని ప్రతి కోణం జమునకు తెలుసట. 

37

కాగా జమున ఓ హీరోని ప్రేమించారనే పుకారు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఆయనెవరో కాదు హరనాథ్. ఈయన అప్పట్లో రొమాంటిక్ హీరోగా వెలుగొందారు. పౌరాణిక పాత్రలకు కూడా చక్కగా సరిపోయేవాడు. మంచి నటుడు అలాగే అందగాడు కావడంతో హరనాథ్ ని హరనాథ్ ప్రేమించారట.

47
Jamuna

Jamuna


ఈ విషయం పరిశ్రమలో చక్కర్లు కొడుతుండగా ఎస్వీ రంగారావు జమునను హెచ్చరించారట. హరనాథ్ పేరు ఎత్తకుండా... ఓ కుర్ర హీరోకి దగ్గరయ్యావని అందరూ అనుకుంటున్నారు. అది నా చెవిన కూడా పడింది. అతడు ఎన్టీఆర్ అంతటివాడు అవుతాడని అనుకుంటున్నారు. కానీ నాలా తాగుబోతు అవుతాడు. జాగ్రత్త అని హితబోధ చేశాడట. 
 

57


అప్పటి నుండి జాగ్రత్త పడ్డ జమున హరనాథ్ ని దూరం పెట్టారట. ఎస్వీర్ చెప్పినట్లే తాగుడుకు బానిసైన హరనాథ్ చిన్న వయసులోనే కన్నుమూశారు. కెరీర్లో కూడా ఆయన ఎదగలేకపోయారు. మరోవైపు జమున అతిపెద్ద స్టార్ గా అవతరించి వందల చిత్రాల్లో నటించారు. 
 

67

జమున 1965లో జూలూరి రమణారావు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు వంశీ జూలూరి. అమ్మాయి పేరు స్రవంతి. 

77


86 ఏళ్ల వెండితెర సత్యభామ తన సినిమాల జ్ఞాపకాలు తెలుగు ప్రేక్షకులకు వదిలి వినీలాకాశంలోకి ఎగిరిపోయారు. నేడు ఆమె కన్నుమూశారు. 14 ఏళ్లకే హీరోయిన్ గా మారిన జమున సుదీర్థ కాలం సేవలు అందించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Wedding: అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎక్కడో తెలుసా? వాహ్‌
Recommended image2
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Recommended image3
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved