పుష్ప2 కోసం మాజీ హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్న సుకుమార్, అనసూయ దాక్షాయని పాత్రలా కాదు కదా...?
పుష్ప పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడంతో.. పార్ట్ 1 మీద దృష్టి పెట్టాడు సుకుమార్. ఈ సినిమాకోసం మాజీ హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడు.
టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈసినిమా మొదటి భాగం 2021 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్ళినందకు బన్నీకి సూపర్ గిఫ్ట్ లభించింది. అటు రష్మిక బాలీవుడ్ రేంజ్ లో ఇమేజ్ పెంచుకుంది. అంతే కాదు సుకుమార్ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు కూడా వచ్చింది.
ఇక పుష్ప పార్ట్ 2ను అంతకు మించి అన్న విధంగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈసినిమాకు సంబంధించిన పనులు అప్పుడు స్టార్ట్ చేశాడు. పుష్ప పార్ట్ 1 తరువాత మరో సినిమాచేసి పార్ట్ 2 చేద్దాం అనుకున్న బన్నీ కూడా మనసు మార్చుకుని పుష్ప సెకండ్ పార్ట్ సినిమాను స్టార్ట్ చేయమని చెప్పడంతో పనులు మొదలెట్టాడు సుకుమార్.
ప్రస్తుతం సుకుమార్ పుష్ప2 కోసం క్యారెక్టర్స్ సెలక్షన్ పనిలో ఉన్నాడు. సినిమాకు ప్లాస్ అయ్యేలా.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ఇంకా దూసుకుపోయేలా.. పుష్ప పార్ట్-2 ను సెట్ చేస్తున్నాడు సుకుమార్. ఈక్రమంలోనే మాజీ హీరోయిన్ ను ఆయన రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.
పుష్పా పార్ట్ 2 కోసం మాజీ హీరోయిన్ ఇంద్రజను రంగంలోకి దింపుబోతున్నాడు సుకుమార్. పార్ట్ 2లో కీ రోల్ పోషించేలా ఇంద్రజ పాత్రను డిజైన్ చేశాడట సుకుమార్. దానికి తగ్గట్టు స్క్రిప్ట్ లో కూడా చేంజస్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఇంద్రజకు కథ చెప్పడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అయిపోయినట్టు సమాచారం.
ఇక పుష్ప పార్ట్ 1 లో కూడా అనసూయ పాత్రగురించి ముందు నుంచీ ఇలాంటి ప్రచారమే జరిగింది. అనసూయ దాక్షాయినిగా ఒక ఊపు ఊపుతుంది అని భావించారు అంతా.. పోష్టర్ లో అనసూయ గెటప్ చూసి.. సినిమాలో ఈమే అసలు విలనేమో అనుకున్నారంతా.. కాని సినిమాలో మాత్రం ఆమె పాత్రను తేలగోట్టాడు సుకుమార్.
ఇక ఇప్పుడు ఇంద్రజ విషయంలో కూడా అనసూయ మాదిరిగానే రిపిట్ కాబోతుందేమో అన్న అభిప్రయాం వ్యక్తం అవుతుంది. ముందు నుంచే ఈ హడావిడి చేసి.. ఇంద్రజను అనసూయ లాగే ఓ అప్పుడప్పుడు కనిపించే పాత్రకు పరిమితం చేస్తారా..? లేక అనసూయ విషయంలో వచ్చిన విమర్షల వల్ల ఈసారి ఇంద్రజ పాత్రను స్ట్రాంగ్ డిజైన్ చేస్తారా అనేది చూడాలి.
మొత్తానికి సుకుమార్ గట్టి ప్లాన్ లోనే ఉన్నాడు. పుష్ప పార్ట్ 2 కోసం.. గట్టిగా పని మొదలు పెట్టాడు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడ్డాడు. ఈసారి పుష్ప పార్ట్ 2 ను పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ చేసుకోగలిగితే.. ఇటు సుకుమార్ కు.. అటు అల్లు అర్జున్ కు .. మరో వైపు రష్మికాకు తిరుగుండదని చెప్పవచ్చు. అంతే కాదు ప్రభాస్ తరువాత బన్నీ ఆ రేంజ్ లో పాన్ ఇండియా స్టార్ అనిపించుకునే అవకాశాలు లేకపోలేదు.