MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Aamani: తెలుగు కంటే తమిళ్ లోనే అది ఎక్కువ, నటి ఆమని షాకింగ్ కామెంట్స్..

Aamani: తెలుగు కంటే తమిళ్ లోనే అది ఎక్కువ, నటి ఆమని షాకింగ్ కామెంట్స్..

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ యాక్ట్రస్ ఆమని. ప్రస్తుతం త్రిషపై నటుడు మన్సూర్ కామెంట్స్ మంటలు పుట్టిస్తున్న టైమ్ లో ఆమని కామెంట్స్ ఇంకా వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 22 2023, 09:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి ఆమని గురించి  ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె నటన అందరికి తెలిసిందే. నరేష్ ,రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు లాంటి స్టార్స్ తో ఫ్యామిలీ మూవీస్ చేసిన ఆమని.. నాగార్జున లాంటి హీరోలతో మాస్ సినిమాలలో అరించింది. స్టార్ హీరోల సరసన నటించి మెపించిన ఈ సీనియర్ బ్యూటీ.. ఆతరువాత  సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నటి ఆమని ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబ లకిడి పంబ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరమీదకు  ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఆతరువాత వరుసగా ఆఫర్లు సాధించింది.  మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభ సంకల్పం వంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు. రెండు సార్లు నంది అవార్డులు కూడా అందుకున్నారామె. 

37

తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమని..  అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో..  పెళ్లి చేసుకుని  చాలా కాలం పాటు  సినిమాలకు దూరమయ్యారు. ఆమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమని.. మిడిల్ క్లాస్ మదన్ పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ నలుగురు,  మిడిల్ క్లాస్ అబ్బాయి, హలో గురు ప్రేమ కోసమే, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో నటించారు. 

47

ఇలా వరుస అవాకశాలను సెకండ్ ఇన్నింగ్స్ లో పొందుతున్న ఆమని..తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఆమని తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎదుర్కున్న కష్టాలు ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మరీముఖ్యంగా తమిళ ఇండస్ట్రీపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఫోటోలు చూసి పిలిచేవారని.. తీరా వెళ్లేసరికి ఈ అమ్మాయా? అని పెదవి విరిచేవారని ఆమని చెప్పారు. 

57

తెలుగులో కంటే తమిళంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేదని.. తను ఫేస్ చేశానని చెప్పారు ఆమని. కలర్ తక్కువగా ఉండటం తో తనను  చాలా సినిమాలకు తీసుకుంటామని ముందు చెప్పి.. ఆతరువాత రిజెక్ట్ చేసేవారని.. దాంతో చాలా సార్లు బాధపడ్డానన్నారు.  రంగు చూసి తనకు టాలెంట్ ఉందో లేదో అనే అనుమానంతో మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేసేవారని ఆ విషయం తనను ఎంతగానో బాధించేదని ఆమని గుర్తు చేసుకున్నారు.

67

అంతే కాదు సినిమా ఉందని పిలిచి.. టూ పీసెస్ బికినీ వేసుకోవాలి అనేవారట.  స్ట్రెచ్ మార్కులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి బట్టలు విప్పి చూపిస్తారా?  అని అడిగి ఇబ్బంది పెట్టేవారట.  ఏదైనా సినిమా ఒప్పుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్న రెండు రోజుల తర్వాత మేనేజర్ వచ్చి  డైరెక్టర్ గారో.. ఫైనాన్సరో మిమ్మల్ని ఓసారి బీచ్ దగ్గరకు రమ్మంటున్నారని పిలిచేవాడని.. ఒంటరిగా రమ్మని అడగటంతో విషయం అర్ధమై పోయేదని ఆమని అన్నారు.

77

అయితే ఇంది తన ఒక్కరికే కాదు.. ఈ ఫీల్డ్ లో ఉన్న అందరికి కామన్ అన్నారు ఆమని. సినిమా అనే కాదు..  ఏ రంగంలో అయినా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మంచి, చెడు ఎంపిక చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుందని ఆమె అన్నారు. ప్రస్తుతం త్రిషపై తమిళ నటుడు మన్సూర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో మంటలు పుట్టిస్తున్న తరుణంలో.. ఆమని చేసిన ఈ  క్యాస్టింగ్ కౌచ్‌ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved