MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ పై సుమన్ షాకింగ్ కామెంట్స్... సీనియర్ హీరోకి జూనియర్ పై ఇలాంటి అభిప్రాయం ఉందా?

ఎన్టీఆర్ పై సుమన్ షాకింగ్ కామెంట్స్... సీనియర్ హీరోకి జూనియర్ పై ఇలాంటి అభిప్రాయం ఉందా?

సీనియర్ నటుడు సుమన్ హీరో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు?  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 17 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR and Suman

NTR and Suman


ఒకప్పుడు స్టార్ గా వెలిగిన సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. ఆయన తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో సుమన్ హీరో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


సుమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు. దేవర విడుదలకు ముందే ఇన్ని రికార్డులు అంటే సామాన్యం కాదు. అది అందరు నటులకు సాధ్యం కాదు. దర్శకుడు కొరటాల శివతో పాటు దేవర మూవీ టీమ్ వలన కూడా ఇది సాకారం అయ్యింది. దేవరకు భారీ క్రేజ్ ఏర్పడింది. 

ఎన్టీఆర్ బాల్యం నుండే క్లాసికల్ డాన్సర్. అందుకే ఆయన ఏ డాన్స్ వేసినా గ్రేస్ ఉంటుంది. అలాగే డైలాగ్స్ చెప్పడంలో చిన్నప్పటి నుండే అలవాటు ఉంది. అందులో ఆయన మాస్టర్. డాన్సుసుల పై కూడా పట్టు ఉంది. సిల్వర్ స్క్రీన్ పై నటులు ఎలా కనిపించాలో ఎన్టీఆర్ కి అవగాహన ఉంది. 
 

36


అంకితభావం, నిబద్ధత కలిగిన నటుడు. సెట్స్ లో అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. ప్రతి సన్నివేశాన్ని టీం తో చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయనతో మరోసారి కలిసి నటించాలని కోరుకుంటున్నాను. దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.. అని అన్నారు. 

నా అల్లుడు మూవీలో సుమన్ ఎన్టీఆర్ కి మేనమామ పాత్ర చేశాడు. అలాగే దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేశారు. అవకాశం వస్తే ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు సిద్ధమని సుమన్ తన మనసులో కోరిక బయటపెట్టాడు. 
 

46


దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా అందుబాటులోకి రానుంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర ట్రైలర్ ఆకట్టుకుంది. 

దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. 
 

56


అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ లోని ఓ వర్గం దేవరను టార్గెట్ చేశారు. ట్రైలర్ పై నెగిటివ్ ప్రచారం చేశారు. దేవర చిత్రాన్ని తొక్కేసే ఆలోచనలో ఉన్నారు. 

కొన్నాళ్లుగా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడలేదు. దీంతో టి టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. 
 

66

ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ లోని ఓ వర్గం ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో దేవర విజయం ఎన్టీఆర్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక ఏమవుతుందో చూడాలి. 

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image2
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Recommended image3
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved