MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో తీవ్ర విషాదం, సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత, కారణం ఏంటంటే?

టాలీవుడ్ లో తీవ్ర విషాదం, సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత, కారణం ఏంటంటే?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. దాదాపు 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన తనయుడు మరణించిన కొన్ని నెలలకే ఆయన కూడా కన్నుమూయంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 01 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Image Credit : Asianet News

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. గుండెపోటు కారణంగానే రఘునాథ్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణంతో తెలుగు సినిమా రంగం ఒక అనుభవజ్ఞుడైన నటుడిని కోల్పోయింది. ఈ విషయం తెలిసి తెలుగు సినీ ప్రముఖులు రఘునాథ్ రెడ్డికి సంతాపం ప్రకటిస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు..

రఘునాథ్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఆయన తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సహాయ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్‌తో పాటు నెగిటివ్ రోల్స్ లో కూడా తనదైన నటనతో మంచి పేరు సంపాదించారు. దాదాపు 370కి పైగా సినిమాల్లో నటించిన రఘునాథ్ రెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులను కూడా సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా..
Image Credit : Asianet News

వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా..

శోభన్ బాబు హీరోగా నటించిన ‘సర్పయాగం’ సినిమాతో రఘునాథ్ రెడ్డి నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లోనూ రఘునాథ్ రెడ్డి వందల సినిమాల్లో నటించారు. 

అన్ని భాషల్లో తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు రఘునాథ్ రెడ్డి. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో రఘునాథ్ రెడ్డి ప్రత్యేకతగా నిలిచారు.

కొడుకు మరణం తట్టుకోలేకపోయిన నటుడు..

ఈ మధ్య కాలంలోనే కొన్ని నెలల క్రితం రఘునాథ్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో మృతి చెందారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ఆ ఘటన తర్వాత ఆయన చాలా క్షోభను అనుభవించినట్లు తెలిసింది. 

అదే ఆలోచనతో రఘునాథ్ రెడ్డి ఆరోగ్యంగురించి పట్టించుకోలేదు. కుమారుడి మరణం తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి కూడా గుండె పోటుకు గురయ్యారు. నెలల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Related Articles

Related image1
Adavi Ramudu Review : 50 ఏళ్ల క్రితం.. 300 రోజులు ఆడి, 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ సినిమా..
Related image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Adavi Ramudu Review : 50 ఏళ్ల క్రితం.. 300 రోజులు ఆడి, 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ సినిమా..
Recommended image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved