MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కుబేర తర్వాత శేఖర్ కమ్ముల ప్లాన్ ఇదేనా.. నానితో భారీ పాన్ ఇండియా చిత్రం ?

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల ప్లాన్ ఇదేనా.. నానితో భారీ పాన్ ఇండియా చిత్రం ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేరా’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2025, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుబేరతో మరోసారి శేఖర్ కమ్ముల మార్క్
Image Credit : Youtube

కుబేరతో మరోసారి శేఖర్ కమ్ముల మార్క్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేరా’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై, తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది. ఈ చిత్ర సక్సెస్ తో శేఖర్ కమ్ముల మరోసారి తాను వైవిధ్యమైన దర్శకుడిగా నిరూపించుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేకుండా తాను నమ్మిన కథని నిజాయతీగా తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల.

25
కొన్ని నెలలు రిలాక్స్ కానున్న శేఖర్ కమ్ముల
Image Credit : instagram

కొన్ని నెలలు రిలాక్స్ కానున్న శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల కుబేర తర్వాత కొన్ని నెలలు విరామం తీసుకుని, కుటుంబంతో పాటు టీమ్‌తో రీలాక్స్ అయ్యే ప్లాన్‌లో ఉన్నారు. ఆ తర్వాత తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పై పని ప్రారంభించనున్నారు.

Related Articles

Related image1
షర్ట్ మార్చితే లక్ష రూపాయలు ఇస్తా, చిరంజీవిని చూసి వణికిపోయిన రజినీకాంత్.. కెమెరామెన్ తో ఓపెన్ గా..
Related image2
మగధీరతో నేషనల్ అవార్డు, ఆ కొరియోగ్రాఫర్ వల్లే సిల్క్ స్మిత కెరీర్ పడిపోయిందా.. బాలయ్య మూవీ షూటింగ్ లో రచ్చ
35
నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్
Image Credit : our own

నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్

సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని నానితో చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ప్రాథమికంగా ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దగ్గర ఉందట. కుబేరా విడుదలకి ముందే నాని, శేఖర్ కమ్ముల కలిసి సమావేశమై సినిమా చేయాలని చర్చించారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ ఖరారు కాలేదు.

45
కుబేర తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సక్సెస్
Image Credit : our own

కుబేర తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సక్సెస్

నానితో తెరకెక్కించే చిత్రానికి శేఖర్ కమ్ముల మరింత పకడ్బందీగా బలమైన కథ రెడీ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. దానికి కారణం కుబేరా చిత్రానికి తెలుగు రాష్ట్రాలకు బయట పెద్దగా ఆదరణ రాకపోవడం. అందుకే శేఖర్ కమ్ముల బలమైన అంశాలు ఉండే కథపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

55
శేఖర్ కమ్ముల చిత్రాలు
Image Credit : our own

శేఖర్ కమ్ముల చిత్రాలు

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీపై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. రెండు నెలల్లో ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాని చివరగా హిట్ 3 చిత్రంలో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. మరోవైపు నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇక శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రం నుంచి టాలీవుడ్ లో ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. హ్యాపీడేస్, ఫిదా, గోదావరి, లీడర్ లాంటి చిత్రాలు శేఖర్ కమ్ములకి దర్శకుడిగా ప్రశంసలు దక్కేలా చేశాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Recommended image2
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే
Recommended image3
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Related Stories
Recommended image1
షర్ట్ మార్చితే లక్ష రూపాయలు ఇస్తా, చిరంజీవిని చూసి వణికిపోయిన రజినీకాంత్.. కెమెరామెన్ తో ఓపెన్ గా..
Recommended image2
మగధీరతో నేషనల్ అవార్డు, ఆ కొరియోగ్రాఫర్ వల్లే సిల్క్ స్మిత కెరీర్ పడిపోయిందా.. బాలయ్య మూవీ షూటింగ్ లో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved