- Home
- Entertainment
- Bigg Boss 6 Telugu: వాసంతి ఎలిమినేటెడ్ ?.. గ్లామర్‌కే షాకిచ్చిన బిగ్ బాస్.. తెరవెనుక ప్లాన్ అదేనా?
Bigg Boss 6 Telugu: వాసంతి ఎలిమినేటెడ్ ?.. గ్లామర్‌కే షాకిచ్చిన బిగ్ బాస్.. తెరవెనుక ప్లాన్ అదేనా?
బిగ్ బాస్ 6 తెలుగు పదోవారం ఊహించని షాక్ ఇస్తున్నారు బిగ్ బాస్. శనివారం బాలాదిత్యని ఎలిమినేట్ చేయగా, ఇప్పుడు గ్లామర్ బ్యూటీ వాసంతిని కూడా ఇంటికి పంపించబోతున్నారట.

బిగ్ బాస్ 6 తెలుగు(Bigg Boss 6 Telugu) షోకి సంబంధించి చాలా తక్కువ టీఆర్‌పీ రేటింగ్ వస్తోంది. హౌజ్‌లో కంటెస్టెంట్లు కూడా డల్‌గా గేమ్ ఆడుతున్నారు. చాలా వరకు కాంప్రమైజ్ ధోరణిలో, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సానుభూతిల కోసమే ఎక్కువగా ట్రై చేస్తున్నారు. లేజీగా ఉన్న కంటెస్టెంట్లని సైలెంట్‌గా ఎలిమినేట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఊహించని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టి కంటెస్టెంట్లలో గుబులు పుట్టిస్తున్నారు. అదేసమయంలో షోపై ఆడియెన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు హోస్ట్ నాగార్జున.
పదో వారంలో శనివారం ఎపిసోడ్‌లో బలమైన కంటెస్టెంట్‌గా, ఇంటి పెద్దలాగా ఉన్న బాలాదిత్య(Baladitya)ని ఎలిమినేట్ చేశారు. ప్రింటింగ్ పేపర్‌లో డైరెక్ట్ గా పేపర్ లో బాలాదిత్య ఫోటో రావడంతో ఆయన్ని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేశాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. హౌజ్‌లో ఏం జరుగుతుందనే ఆయోయానికి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ వారం మరో ఎలిమినేషన్ ఉంటుందని రెండు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అదే జరగబోతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో వీక్ కంటెస్టెంట్‌ని హౌజ్ నుంచి ఇంటికి పంపించాలని నిర్ణయించారట. రెండో వారంలో రెండు ఎలిమినేషన్లు పెట్టినట్టుగానే ఈ సారి కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారట. మరో ఎలిమినేట్ కంటెస్టెంట్ వాసంతి (Vasanthi) అని తెలుస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
బాలాదిత్య శనివారం ఎలిమినేట్ కాగా, ఆదివారం ఎపిసోడ్‌లో వాసంతిని ఇంటికి పంపించబోతున్నారట. అయితే మెరీనా, వాసంతిల మధ్య ఉత్కంఠభరితమైన వాతావరణం క్రియేట్ చేసి, చివరికి వాసంతిని ఎలిమినేట్ చేయబోతున్నారని సమాచారం. వాసంతి ఎలిమినేట్ అనే యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాలో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి వాసంతి ఇప్పటి వరకు గేమ్ పరంగా తనేంటో చూపించిన సందర్భం పెద్దగా లేదు. ఆమె గ్లామర్‌కే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. నిన్న బాలాదిత్య కూడా అదే చెప్పాడు. హౌజ్‌లో గేమ్ పరంగా, యాక్టివ్‌గా ఉండే విషయంలో వాసంతి కాస్త వీక్‌గా ఉంది. అందుకే గ్లామర్‌తో సంబంధం లేకుండా ఆమెని ఎలిమినేట్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ వారం ఇద్దరి ఎలిమినేషన్ వెనకాల బిగ్ బాస్ భారీ ప్లాన్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 6
హౌజ్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్లని మళ్లీ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గీతూ(Geetu), అర్జున్(Arjun)ని మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారని టాక్ మొదలైంది. అయితే ఇందులో నిజం లేదని సమాచారం. ఒక్క సారి ఎలిమినేట్ అయిన సభ్యులను తిరిగి హౌజ్‌లోకి తీసుకురావడం జరగదని టాక్. అవసరమైతే కొత్త వారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారేమో గానీ, పాతవారినే మళ్లీ రీఎంట్రీ ఇప్పించడం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్లలో ఇంకా వాసంతితోపాటు మెరినా, కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ ఉన్నారు.