- Home
- Entertainment
- `పుష్ప 2` చూసి సగం మంది స్టూడెంట్స్ చెడిపోయారు, హెడ్‌మాస్టర్ ఆవేదన.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్
`పుష్ప 2` చూసి సగం మంది స్టూడెంట్స్ చెడిపోయారు, హెడ్‌మాస్టర్ ఆవేదన.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్
`పుష్ప 2` సినిమా చుట్టూ ఇప్పటికే పలు వివాదాలు వెంటాడాయి. ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ ఫైర్ అయ్యింది. దీంతో అల్లు అర్జున్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఆ కథేంటో తెలుసుకుందాం.

pushpa 2 movie
`పుష్ప 2` సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1871కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఈ లెక్కన ఇది బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. `దంగల్` తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సుకుమార్ రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే.
pushpa 2 movie
అయితే ఈ మూవీని ప్రారంభం నుంచి వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్ రోజు అల్లు అర్జున్ అభిమానుల మధ్య సంధ్య థియేటర్‌లో సినిమా చూడ్డానికి రావడంతో భారీగా ఫ్యాన్స్ వచ్చారు. తొక్కిసలాట జరిగిన రేవతి అనే మహిళ చనిపోయింది.
ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అల్లు అర్జున్‌ని జైలుకి కూడా పంపించింది. ఇంకా ఈ కేసు నడుస్తుంది.
Allu Arjun, Pushpa2,
వివాదంతో సంబంధం లేకుండా ఈ మూవీ నార్త్ లో దుమ్ములేపింది. అక్కడ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. కానీ ఈ మూవీ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ కామెంట్లు, వివాదాస్పద విషయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొందరు రాజకీయ నాయకులు దీన్ని తీవ్రంగా విమర్శించారు.
తాజాగా ఓ హెడ్ మాస్టర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈ మూవీ చూసి తమ స్కూల్‌లో సగం మంది స్టూడెండ్స్ చెడిపోయారని ఆరోపించింది. యూసఫ్‌గూడ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు.
yousufguda school headmaster
`పుష్ప 2` సినిమా చూసి మా స్కూల్‌లో సగం మంది స్టూడెంట్స్ చెడిపోయారు. జుట్టులు పెంచుకుంటున్నారు. వారి హెయిర్ పిట్టగూడులుగా మారాయి. ఏదైనా అంటే తగ్గేదెలే అని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. అసలు ఇలాంటి సినిమాలకు ఎలా పర్మీషన్ ఇస్తారు, ఎలా సెన్సార్ చేస్తారు` అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తమ స్కూల్‌లో ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలున్నారు. వారిని నేను జెమ్స్ గా తయారు చేయాలనుకుంటాను. కానీ ఇలాంటి సినిమాలు పిల్లల్ని చెడగొడుతున్నాయి అని ఆమె ఫైర్ అయ్యింది.
pushpa 2 movie
ప్రస్తుతం ఆమె వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అదనుగా భావించి కొందరు ట్రోలర్స్ అల్లు అర్జున్, సినిమా టీమ్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు ఎలా ఇస్తారంటూ కామెంట్ చేస్తున్నారు.
బన్నీని ఆడుకుంటున్నారు. ఏం చేసినా ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు, సినిమా రిలీజ్ అయ్యింది. రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ములేపుతుంది. మొత్తానికి `పుష్ప 2` పై వివాదాలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.
read more: చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్ చరణ్
also read: రజనీకాంత్‌కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? దానికోసం అర్థరాత్రి మారువేషంలో వాళ్లింటికి వెళ్లేవాడా?