- Home
- Entertainment
- Scene vs Mahasakthi: సూర్య వర్సెస్ నయనతార.. దీపావళి రేసులో బాక్సాఫీస్ విన్నర్ ఎవరు? 4 రోజుల కలెక్షన్ల రిపోర్ట్
Scene vs Mahasakthi: సూర్య వర్సెస్ నయనతార.. దీపావళి రేసులో బాక్సాఫీస్ విన్నర్ ఎవరు? 4 రోజుల కలెక్షన్ల రిపోర్ట్
Scene vs Mookuthi Amman 2 Box Office : సూర్య నటించిన 'సీన్', నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

సీన్ vs మూకుత్తి అమ్మన్(మహాశక్తి ) బాక్సాఫీస్
జితు మాధవన్ డైరెక్షన్లో సూర్య హీరోగా వచ్చిన 'సీన్' సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూర్య, నజ్రియా, నస్లన్ యాక్టింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అని ఫ్యాన్స్ చెప్తున్నారు. మాస్ యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిలిచింది.
దీంతోపాటు అదే రోజు నయనతార నటించిన `మహాశక్తి`(మూకుత్తి అమ్మన్ 2) విడుదలైంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. మరి ఈరెండు చిత్రాల్లో ఏది ముందు ఉంది? ఏది హిట్ ఏది ఫట్ అనేది చూస్తే,
దూసుకుపోతున్న సీన్
సూర్య, నస్లన్, నజ్రియా నజీమ్ తో పాటు ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ `సీన్`. జీతు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య కలిసి 2డీ ఎంటర్ టైన్మెంట్స్, ళగరం స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్ గా ఉన్నారు. డీఎస్పీ ప్రేమ్ రాజ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో సూర్య నటించాడు. ఈ స్టైలిష్, మాస్ లుక్ తో సూర్య అభిమానులను అట్రాక్ట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
సీన్ కలెక్షన్స్ ఎంత?
బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.149.55 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్న ఒక్కరోజే ఇండియాలో రూ.21.25 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5 కోట్లు రాబట్టింది. ఇందులో తమిళనాడులో అత్యధికంగా నిన్న ఒక్కరోజే రూ.17.85 కోట్లు, తెలంగాణ, ఏపీలో రూ.3.40 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 4 రోజుల్లో ఇండియాలో రూ.98.05 కోట్లు, ఓవర్సీస్ లో రూ.51.50 కోట్లు కలెక్ట్ చేసింది.
మూకుత్తి అమ్మన్ 2(మహాశక్తి) బాక్సాఫీస్
మరోవైపు సుందర్ సి డైరెక్షన్లో నయనతార లీడ్ రోల్ లో దీపావళికి వచ్చిన 'మూకుత్తి అమ్మన్ 2 - మహాశక్తి' సినిమా కూడా థియేటర్లలో కలెక్షన్ల పరంగా స్టెడీగా ఉంది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 4 రోజుల్లో ఇండియాలో రూ.16.32 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.20 కోట్లు ఉంటాయని అంచనా. నిన్న ఒక్కరోజే ఈ సినిమా రూ.5.15 కోట్లు రాబట్టింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే అత్యధిక వసూళ్లు.
మూకుత్తి అమ్మన్ 2 కాస్ట్ అండ్ క్రూ
వేల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డాక్టర్ ఐసరి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమాకి సుందర్ సి కథ అందించి, డైరెక్ట్ చేశాడు. హిప్ హాప్ తమిళా మ్యూజిక్ అందించాడు. కుష్బూ సుందర్, కుష్మిత గణేష్, ఇషాన్ సక్సేనా, విఘ్నేష్ శివన్ కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. నయనతార, దునియా విజయ్, రెజీనా కసాండ్రా, ఊర్వశి, యోగి బాబు, మైనా నందిని, గరుడ రామ్, అభినయ, శృతి ఎస్., సింగంపులి అన్నావి, వి.ఆర్.స్వామినాథన్, శివకుమార్ ఎస్., సునీల్ వర్మ ఇందుకూరి, వర్షిణి వెంకట్, పల కరుప్పయ్య తదితరులు ఈ 'మహాశక్తి'లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం `సీన్`తో పోటీలో వెనకబడిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ మూవీ స్థాయిలో డీసెంట్ నెంబర్స్ తో రన్ అవుతుంది. నేటి నుంచి వచ్చే వసూళ్లని బట్టి మూవీ భవిష్యత్ ఆధారపడి ఉంది.













