నా ప్లేస్ లో శివాజీ ఎలిమినేట్ కావాల్సింది.. అమర్ దీప్ చాలా సిల్లీ, శుభ శ్రీ హాట్ కామెంట్స్
నటిగా, మోడల్ గా రాణిస్తున్న శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అవకాశం అందుకుంది. శుభశ్రీ గ్లామర్ తో, క్యూట్ వేషాలతో హౌస్ లో అలరించింది.
నటిగా, మోడల్ గా రాణిస్తున్న శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అవకాశం అందుకుంది. శుభశ్రీ గ్లామర్ తో, క్యూట్ వేషాలతో హౌస్ లో అలరించింది. అంతే కాదు ఐదువారాల పాటు వినోదం అందిస్తూ హంగామా చేసింది. కానీ అనూహ్యంగా శుభశ్రీ గత ఆదివారం హౌస్ లో ఎలిమినేట్ అయింది.
బయటికి వచ్చాక శుభశ్రీ బిగ్ బాస్ సీజన్ 7పై తన ఎలిమినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదు. ఎలిమినేషన్ వల్ల చాలా నిరాశపడ్డా. ఎందుకంటే గత రెండు వారాలుగా నేను హౌస్ లో ఎక్స్టార్డినరీ గా పెర్ఫామ్ చేశాను. అందరితో కలసిపోయాను.
కానీ నన్ను ఎలిమినేట్ చేశారు. నా ఫుటేజ్ ఏం టెలికాస్ట్ అయిందో.. ఏమి కాలేదో తెలియదు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు. నా ఎలిమినేషన్ మాత్రం ఊహించలేదు. నా ప్లేస్ లో శివాజీ కానీ, అమర్ డీప్ కానీ ఎలిమినేట్ అవుతారనుకున్నా. అలా జరగకపోతే తేజ అయినా ఎలిమినేట్ అవుతాడనుకున్నా. కానీ నన్ను ఎందుకు ఎలిమినేట్ చేసారో అర్థం కావడం లేదు.
నేను హౌస్ లో ఎవ్వరితోనూ లవ్ ట్రాక్ నడపలేదు. నా గురించి వస్తున్న రూమర్స్ అన్నీ అవాస్తవం అని శుభశ్రీ పేర్కొంది. వాస్తవంగా మాట్లాడుకుంటే నా ఎలిమినేషన్ కి కారణం అమర్ దీప్. అమర్ డీప్ నన్ను చాలా సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేశాడు అంటూ శుభశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నాకు హౌస్ లో గౌతమ్ యావర్ ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కానీ వారిలో గౌతమ్ కాస్త స్వార్థపరుడు అని శుభశ్రీ తెలిపింది. ఎక్కువగా లేడీస్ నే ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అందుకే గత వారం నేను ఎలిమినేట్ కాను అని నమ్మకంతో ఉన్నా. కానీ నిరాశ తప్పలేదు.
ఇక హౌస్ లో గ్లామర్ బ్యూటీగా ఉన్న శోభా శెట్టిపై శుభ శ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. శోభా శెట్టికి ఏదైనా సలహా ఇస్తే ఆమె క్యాజువల్ గా తీసుకోకుండా మనసుకు తీసుకుని బాధపడుతుంది అని తెలిపింది.