MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • సావిత్రి నుంచి నయనతార వరకూ.. సౌత్ లో పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్స్ వీళ్ళే..?

సావిత్రి నుంచి నయనతార వరకూ.. సౌత్ లో పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్స్ వీళ్ళే..?

సౌత్ సినిమాలో స్టార్ హీరోలే కాదు.. పవర్ ఫుల్ స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు..?   

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 14 2024, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హీరోల డామినేషన్ ఉన్న సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో..మేము సెపరేట్ అంటూ.. స్టార్ హీరోలను మించిన స్టార్ డమ్ ను సంపాదించారు కొంత మంది హీరోయిన్లు. ఇమేజ్ పరంగా.. రెమ్యూనరేషన్ పరంగా ఈ తారలు ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు. సావిత్రి నుంచి... నయనతారవరకూ.. ఇండస్ట్రీని ఏలినవారు వీరే..?  సౌత్ ఇండియన్ సినిమాలో ఎవర్ గ్రీన్ లేడీ సూపర్ స్టార్స్ ఎవరంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడా..? అందుకే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చాడా..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ లిస్ట్ లో  సావిత్రి పేరు చెప్పకుండా ఉండలేం.  స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ముందు ఉండేది ఆమె పేరే. తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర నటిగా వెలుగొందిన సావిత్రి హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 250కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మహానటిగా.. తమిళంలో నడిగర్ తిలగంగా  ప్రసిద్ధి చెందిన సావిత్రి 1950 మరియు 1960లలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరు. స్టార్ హీరోల డేట్లు అయినా దొరికేవేమో కాని.. సావిత్రి డేట్ల కోసం ఎదుచూసేవారట దర్శకులు. 

38

ఇక తెలుగు, తమిళ భాషలతో పాటు.. హిందీలో కూడా స్టార్ లకే స్టార్ గా వెలిగింది శ్రీదేవి.   ఇండియన్ సినిమా ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి దాదాపు స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.  హిందీలో రంగప్రవేశం చేసి బాలీవుడ్‌లోనూ అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆమె.. ఆతరువాత ఇంగ్లీషు, వింగ్లీష్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.. 2018 లో దుబాయ్ లో అనుమానస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది. 
 

48
Vijayashanthi Quits BJP

Vijayashanthi Quits BJP

ఇక సౌత్ సినిమాలల్లో లేడీ సూపర్ స్టార్ గా పేరు ఉన్న నటి విజయశాంతి. హీరోయిన్ గా ఎంత బ్యూటీఫుల్ పాత్రలు చేసిందో.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు విజయశాంతి న్యాయం చేసినంతగా ఇంకెవరూ చేయలేరేమో.. ఇక ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. అప్పుడప్పుడు మాత్రమే ఒకటీ అరా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు. 

58

ఇక సావిత్రి తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సౌందర్య. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్ర నటిగా వెలుగొందింది. తెలుగు, తమిళం,  కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాలలో నటించారు. సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో.... ఎటువంట రిమార్క్ తెచ్చుకోలేదు. తెలుగు,తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె నటించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన ఆమె  2004లో విమాన ప్రమాదంలో మరణించింది.

68

సౌత్ లో పవర్ ఫుల్ పాత్రల్లో మెరిసిన మరో హీరోయిన్ రమ్య కృష్ణ. కెరీరి బిగినింగ్ లో హీరోయిన్ గా ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. హీరోయిన్ గా నటిస్తూనే పవర్ పాత్రలకు ప్రాణం పోసింది. నరసింహా సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా.. ఆమె నటన తన మూవీకెరీర్ నే మలుపుతిప్పింది. అంతే కాదు చాలా కాలానికి ఆమె బాహుబలితో చేసిన శివగామి పాత్ర.. పాన్ ఇండయానే ఆకర్శించింది. ఇలా  వరుసగా అద్భుతమైన పాత్రలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్ గా నిలబడేలా చేసింది. 

78

ఇక ఈ లిస్ట్ లే చేరిన మరో హీరోయిన్ అనుష్క. ఆమెకూడా అరుంధతి, భాగమతి లాంటిసినిమాలతో లేడీ సూపర్ స్టార్ గామారింది. ఇక బాహుబలి సినిమాలో దేవసేనగా.. గ్లామర్ పాత్రతో పాటు వీరమాతగా ఆమె నటన అద్భుతం అని చెప్పాలి.  సౌత్ సినిమాలో స్టార్ హీరోనలతో సమానంగా ఇమేజ్ సాధించని నటిగా అనుష్క పేరు తెచ్చుకుంది. 

88
Nayanthara

Nayanthara

ఇక తమిళ, తెలుగు సినిమాల్లో లేడీ సూపర్‌స్టార్‌గా  పేరుగాంచిన మరో హీరోయిన్ నయనతార. దాదాపు  20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అలాగే కొనసాగిస్తుంది బ్యూటీ. 40 ఏళ్ళకు చాలా దగ్గరలో ఉన్న ఈ హీరోయిన్.. పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇహేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటూ.. దూసుకుపోతోంది నయనతార. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
తమిళ సినిమా
తెలుగు సినిమా
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved