- Home
- Entertainment
- సావిత్రి, శ్రీదేవి, రమ్యకృష్ణ, శ్రియా..రహస్య వివాహంతో కోట్లాది మంది అభిమానుల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్లు
సావిత్రి, శ్రీదేవి, రమ్యకృష్ణ, శ్రియా..రహస్య వివాహంతో కోట్లాది మంది అభిమానుల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్లు
మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి, స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ, హాట్ హీరోయిన్ శ్రియా.. తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపేసిన హీరోయిన్లు. కోట్లాది మంది అభిమానుల డ్రీమ్ గర్ల్స్. కానీ వీరు రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు ఊహించని షాకిచ్చారు.

మొదటగా మహానటి సావిత్రి సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో సావిత్రి తమిళ నటుడు జెమినీ గణేషన్ ప్రేమలో పడింది. ఆయనకు అప్పటికే భార్య, పిల్లలున్నారని తెలిసీ కూడా సడెన్‌గా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుని కోట్లాది అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది.
అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇదే చేసింది. స్టార్ హీరోలకు దీటుగా, లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న శ్రీదేవి బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ఫిదా అయ్యింది. ఆయన్ని రహస్యంగా మ్యారేజ్ చేసుకుని గుండెల్లో పెద్ద రాయి వేసినంత పనిచేసింది. దేవలోకం నుంచి దిగి వచ్చిన అందాల దేవకన్యలా ఉండే శ్రీదేవికి దేశ వ్యాప్తంగా విశేష అభిమానగణం ఉంది. ఆమె రహస్యంగా మ్యారేజ్ చేసుకున్న విసయం తెలిసి, అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఆ తర్వాత మూడేళ్లకి మిథున్‌తో విడిపోయి, తర్వాత నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకుంది శ్రీదేవి.
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన హీరోయిన్ రమ్యకృష్ణ, ఆమె నీలాంబరిగా అభిమానులు ఉర్రూతలూగించిన ఆమె దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించింది. అంతేకాదు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది.
ఇక టాలీవుడ్‌ని షేక్ చేసిన మరో గ్లామర్ హీరోయిన్ శ్రియా సైతం ఇదే చేసింది. ఆమె దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్‌ని ఊపింది. కానీ ఓ రష్యాకిచెందిన ఫొటోగ్రాఫర్ ప్రేమలో పడింది. సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక, నెమ్మదిగా ఆ విషయాన్ని రివీల్ చేసింది, ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ చేసింది.
`ముద్దుల మామయ్య` సినిమాలో బాలకృష్ణ కు చెల్లిగా నటించిన నటి సీత ఆ తర్వాత కోలీవుడ్ లో అనేక చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. సీత మొదట నటుటు పార్థిబన్‌ని వివాహం చేసుకుంది. కొన్నాళ్లకి వీరు విడిపోయారు. ఆ తర్వాత 2010లో సీరియల్ నటుడు సతీష్ ను సీక్రెట్ గా రెండో వివాహం చేసుకుని షాకిచ్చింది.
పవన్ కళ్యాణ్ తో `సుస్వాగతం` సినిమాలో జోడిగా నటించిన హీరోయిన్ దేవయాని దర్శకుడు రాజ్ కుమార్ ను సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
`బిచ్చగాడు` సినిమా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది హీరోయిన్ సాత్నా టైటస్. హాట్ అందాలతో మెస్మరైజ్ చేసే ఈ భామ నటించింది కొన్ని సినిమాలే. అయితే ఆ మధ్య సినిమా బయ్యర్ కార్తీక్ ను రహస్యంగా వివాహం చేసుకుని ఇండస్ట్రీ వర్గాలకు, ఆమె అభిమానులకు షాకిచ్చింది.