- Home
- Entertainment
- సావిత్రి భర్త నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం, చిరంజీవితో కలసి నట విశ్వరూపం, 3 నేషనల్ అవార్డులతో సంచలనం
సావిత్రి భర్త నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం, చిరంజీవితో కలసి నట విశ్వరూపం, 3 నేషనల్ అవార్డులతో సంచలనం
మహానటి సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో ఒక లెజెండ్. సావిత్రి భర్త జెమిని గణేశన్ అనే సంగతి తెలిసిందే. సావిత్రి ఉన్నప్పుడు జెమినీ గణేశన్ ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. ఆమె మరణానంతరం ఒకే ఒక్క తెలుగు సినిమాలో జెమినీ గణేశన్ నటించారు.

Chiranjeevi, Gemini Ganesan
మహానటి సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో ఒక లెజెండ్. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు పోటీగా క్రేజ్ సొంతం చేసుకున్న సావిత్రి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మహానటిగా నిలిచిపోయారు. అప్పట్లో తమిళ సీనియర్ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ లాంటి హీరోల చిత్రాలు తెలుగులో అంతగా డబ్ అయ్యేవి కాదు. డబ్బింగ్ హవా పెరిగింది రజనీకాంత్, కమల్ హాసన్ టైం నుంచే. దీనితో జెమినీ గణేశన్ లాంటి లెజెండ్రీ నటుల నటన గురించి తెలుగు ఆడియన్స్ కి అంతగా తెలియదు.
Savitri
సావిత్రి భర్త జెమిని గణేశన్ అనే సంగతి తెలిసిందే. ఆయన్ని వివాహం చేసుకున్న తర్వాతే సావిత్రికి కష్టాలు మొదలయ్యాయి అనే ప్రచారం ఉంది. సావిత్రి ఉన్నప్పుడు జెమినీ గణేశన్ ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. ఆమె మరణానంతరం ఒకే ఒక్క తెలుగు సినిమాలో జెమినీ గణేశన్ నటించారు. ఆ చిత్రం ఇంకేదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా మిగిలిపోయిన రుద్రవీణ. ఈ చిత్రంలో జెమినీ గణేశన్ చిరంజీవి తండ్రిగా, ఛాందస స్వభావం ఉన్న బ్రాహ్మణుడి పాత్రలో కనిపించారు. చిరంజీవి, జెమినీ గణేశన్ పోటా పోటీగా నట విశ్వరూపం ప్రదర్శించారు.
కె బాలచందర్ దర్శకత్వంలో, ఇళయరాజా సంగీతంలో చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ చిత్రాన్ని 1998లో నిర్మించారు. ఈ మూవీ ఏకంగా 3 నేషనల్ అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నర్గిస్ దత్ అవార్డుతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి నేషనల్ అవార్డులు అందుకున్నారు.
Rudraveena
అదే విధంగా ఈ చిత్రానికి నాలుగు నంది అవార్డులు కూడా దక్కాయి. బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్, స్పెషల్ జ్యూరీ విభాగాల్లో నంది అవార్డులు దక్కాయి.
Rudraveena
ఆ విధంగా జెమినీ గణేశన్ ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించినప్పటికీ అది మెమొరబుల్ గా నిలిచిపోయింది. సావిత్రితో కూడా చిరంజీవి పునాది రాళ్లు చిత్రంలో నటించారు. ఆ మూవీలో వీరిద్దరివీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు కాదు.