- Home
- Entertainment
- మా అమ్మ ఆస్తులు పోగొట్టింది నిజమే..చిరంజీవి భార్య సురేఖతో సంచలన విషయాలు బయటపెట్టిన సావిత్రి కూతురు
మా అమ్మ ఆస్తులు పోగొట్టింది నిజమే..చిరంజీవి భార్య సురేఖతో సంచలన విషయాలు బయటపెట్టిన సావిత్రి కూతురు
మహానటి సావిత్రి అంటే అభిమానం ఉండని తెలుగు వారు ఉండరు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎందరో సీనియర్ నటులు.. చిరంజీవి సహా సావిత్రిని అమ్మ అంటూ అభివర్ణిస్తారు. సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె కుమార్తె చాముండేశ్వరి ఒక బుక్ సిద్ధం చేసింది.

మహానటి సావిత్రి అంటే అభిమానం ఉండని తెలుగు వారు ఉండరు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎందరో సీనియర్ నటులు.. చిరంజీవి సహా సావిత్రిని అమ్మ అంటూ అభివర్ణిస్తారు. సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె కుమార్తె చాముండేశ్వరి ఒక బుక్ సిద్ధం చేసింది. ఆ బుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు. అంతేకాదు సహజనటి జయసుధ, మురళి మోహన్, పరుచూరి గోపాల కృష్ణ, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చిరు సతీమణి సురేఖ అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంటారు. కానీ ఆమె వేదికపై మాట్లాడింది లేదు.
కానీ ఏకంగా సావిత్రి గారి బుక్ లాంచ్ లో సురేఖ.. చాముండేశ్వరిని ఇంటర్వ్యూ చేశారు. చాముండేశ్వరి సావిత్రి గురించి అనేక ఆసక్తికర విషయాలు సురేఖతో పంచుకున్నారు. సావిత్రి బుక్ లాంచ్ ని చిరంజీవి గారితో చిన్న ప్రెస్ మీట్ పెట్టి చేద్దాం అనుకున్నా. అలాగే చేద్దాం అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసారు ఆయన.
మా అమ్మకి చిరంజీవి పెద్దకొడుకు లాంటివారు అని చాముండేశ్వరి తెలిపింది. ఆ మాట వినగానే చిరు చేతులెత్తి నమస్కరించారు. ఇక చాముండేశ్వరి.. సురేఖతో అనేక విషయాలు మాట్లాడుతూ ఆస్తుల ప్రస్తావన తీసుకువచ్చింది. చాలా మంది అంటుంటారు.. సావిత్రి ఆస్తులు మొత్తం పోగొట్టేసింది.. పిల్లలకు ఏమి లేకుండా చేసేసింది అని అంటుంటారు. అది కరెక్ట్ కాదు.
ఎందుకంటే అమ్మ దగ్గర ఎంతో ఆస్తి ఉంది. అందులో పోగా, మోసం చేసే వేరేవాళ్లు లాక్కున్నా కూడా మాకు సరిపడేంత ఆస్తి మిగిలింది. నేను తమ్ముడు ఏ లోటు లేకుండా బతకగలిగేంత ఆస్తి అమ్మ నుంచి వచ్చింది. ఆయా విషయంలో మాకెప్పుడూ బాధ ;లేదు అని చాముండేశ్వరి అన్నారు. తమ్ముడు అమెరికాలో బాగా సెటిల్ అయ్యాడు. నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను అని చాముండేశ్వరి తెలిపింది.
సావిత్రి అప్పట్లో సంపాదించిన ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే కొన్ని వేల కోట్లు అయి ఉంటాయని అంటుంటారు చివరిరోజుల్లో సావిత్రి మోసపోవడమే కాక ఆరోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పటి దుర్భర పరిస్థితులని తానూ గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నట్లు చాముండేశ్వరి ఎమోషనల్ అయ్యారు.