- Home
- Entertainment
- Keerthy Suresh:చిలకపచ్చ చీరలో చిలిపి కోయిల... ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న కీర్తి సురేష్
Keerthy Suresh:చిలకపచ్చ చీరలో చిలిపి కోయిల... ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న కీర్తి సురేష్
ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంది కీర్తి సురేష్. చిలకపచ్చ రంగు పట్టు చీర ధరించిన కళావతి ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చింది. కీర్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా.. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కీర్తి (Keerthy Suresh)నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. నితిన్ తో చేసిన రంగ్ దే అనుకున్నంత విజయం సాధించలేదు. ఆమె లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు.అయితే కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించారు. షూటర్ గా ఆమె నటన చాలా సహజంగా సాగింది.
మహానటి మూవీ కీర్తి సురేష్ ఫేట్ మార్చేసింది. ఆ మూవీతో వచ్చిన క్రేజ్ తో ఆమెకు వరుసగా సినిమాలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పెద్ద చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu)నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ విజయం సాధించిన నేపథ్యంలో కీర్తి కెరీర్ కి ఇంకొన్నాళ్లు ఢోకా లేదు.
ఇక సర్కారు వారి పాట విడుదలకు చాలా సమయం ఉంది. అయినప్పటికీ అప్డేట్స్ షురూ చేశారు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ప్రేమికులరోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేశారు. కళావతి (Kalavathi first single)అనే లిరికల్ సాంగ్ ఇంటర్నెట్ ని ఊపేస్తోంది. యూట్యూబ్ ని షేక్ చేస్తున్న కళావతి సాంగ్ సినిమాకు భారీ హైప్ తెచ్చిపెట్టింది. సెలెబ్రిటీలు సైతం కళావతి సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు.
ఆడియో సక్సెస్ అయితే సగం సినిమా సక్సెస్ అయినట్లే అంటారు. థమన్ మరో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ సర్కారు వారి పాట చిత్రం కోసం సిద్ధం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సర్కారు వారి పాట మూవీలో కీర్తి పాత్రలో గ్లామర్ యాంగిల్ తో పాటు కథలో కీలకమని సమాచారం.
సర్కారు వారి పాట మూవీతో పాటు చిరంజీవి(Chiranjeevi)-మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి సిస్టర్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ చెల్లిగా చేస్తున్న నేపథ్యంలో ఆమె కెరీర్ కి అంతగా ఉపయోగపడకపోవచ్చు.
స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉండి కూడా కీర్తి సిస్టర్ రోల్స్ చేయడం కొసమెరుపు. రజనీ కాంత్ లేటెస్ట్ హిట్ అన్నాత్తేలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ మూవీలో తెలుగులో మాత్రం పరాజయం పొందింది. ప్రస్తుతానికి కీర్తి కెరీర్ కి మాత్రం ఢోకా లేదు. భోళా శంకర్, సర్కారు వారి పాట చిత్రాలతో పాటు తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2022 కీర్తి సురేష్ కి కీలకం కానున్నాయి.