Guppedantha Manasu: రిషిని టార్గెట్ చేసిన సారధి.. వసుని బలిపశువును చేసిన శైలేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తమ్ముడు మీద అసూయతో రగిలిపోతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి మీద ఎందుకంత బాగా అని అడుగుతుంది జగతి. వాడు ఎదిగాడు మంచి పేరు సంపాదించుకున్నాడు అంతకన్నా అసూయకి వేరే కారణం ఏముంటుంది. నేను రిషి సీట్ లో కూర్చోవాలి మా అమ్మ నన్ను మహారాజు లాగా చూడాలనుకుంటుంది.
ఆమె కోరిక తీరుస్తాను అంటూ జగతికి 24 గంటలు గడువు పెడతాడు శైలేంద్ర. ఈ విషయం ఇప్పటికైనా ఎవరికైనా చెప్పకపోతే పెద్ద ప్రమాదమే జరిగే లాగా ఉంది మహేంద్ర కి చెప్పాలి అనుకొని అతనికి ఫోన్ చేస్తుంది జగతి. కానీ మహేంద్ర ఫోన్ కలవదు. మరోవైపు షాక్ లో ఉన్న రిషిని కూర్చోబెట్టి సపర్యలు చేస్తుంది వసుధార. ఇది ప్రమాదవశాత్తు మాత్రమే జరిగింది.
నాకేమీ కాలేదు నువ్వు టెన్షన్ పడకు అంటాడు రిషి. ఒకదాని వెంట ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది జరిగింది కాదు. ఇకనుంచి ప్రతి నిమిషం నేను మీ తోడు ఉంటాను మిమ్మల్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వను అంటుంది వసుధార. ఇంతలో జగతి వచ్చి జరిగిన ప్రమాదానికి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. మహేంద్ర తో చెబుదామనుకున్నాను కానీ లైన్ కలవట్లేదు అని బాధపడుతుంది.
పొరపాటున కూడా ఆయనకి చెప్పకండి పనులన్నీ వదిలేసి వచ్చేస్తారు అలాగే ఇంట్లో కూడా ఎవరికీ చెప్పకండి కంగారు పడతారు అంటాడు రిషి. పెండింగ్ పనులు చాలా ఉన్నాయి వెళ్లి ఆ పని చేసుకోండి అంటాడు రిషి. జగతి కూడా నేను చూసుకుంటాను మేడం మీరు బాధపడకండి వెళ్ళండి అని చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి.
మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పనులు నువ్వు చూసుకో ఆ నిధులు వేరే ఏ పనికి ఉపయోగించొద్దు. చాలామంది మన మీద నమ్మకంతో డబ్బులు డొనేట్ చేస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అంటాడు రిషి. ఇంతలో మేనేజర్ వచ్చి మెడికల్ కాలేజీ బిల్డర్ కి చెక్ ఇష్యూ చేయాలి జగతి మేడం ని అడిగితే మిమ్మల్ని కన్సల్ట్ చేయమన్నారు అంటాడు.
నా అకౌంట్ లో ఎంత ఉంది అని వసుధారని అడుగుతాడు రిషి. రెండు కోట్లు ఉంది చెక్ ఇష్యూ చేసేటంత అమౌంట్ లేదు అంటుంది వసుధార. పర్వాలేదు నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి మేనేజర్ ని అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. ఇంతలో సైలేంద్ర వచ్చి జరిగింది తెలుసుకొని అమౌంట్ నేను ఇస్తాను అంటాడు. అలా నాకు ఇష్టం లేదు అన్నయ్య నన్ను ఇబ్బంది పెట్టవద్దు అంటాడు రిషి.
రిషి, వసు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపు మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన చెక్ ని దాచేస్తాడు శైలేంద్ర. నేరుగా ఆ చెక్కు పట్టుకెళ్ళి సారధికి ఇస్తాడు. నేను చెప్పినట్లు చేయు ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు అంటూ హెచ్చరిస్తాడు. పొరపాట్లు చేయడంలో ఆరితేరిన వాడు ఈ సారధి ఈ విషయంలో ఎలాంటి కంగారు పడొద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సారధి.
నేరుగా మినిస్టర్ దగ్గరికి వెళ్లి రిషి తప్పుడు పనులు చేస్తున్నాడు అంటూ కంప్లైంట్ ఇస్తాడు. మర్యాదగా మాట్లాడు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటూ హెచ్చరిస్తాడు మినిస్టర్. మాటలతో చెప్తే నమ్మరని సాక్ష్యాలు తీసుకువచ్చాను అంటూ చెక్ చూపిస్తాడు సారధి. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన చెక్ మరి ఏ ఇతర పనులకి వాడకూడదు.
కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం నాకు అడ్వాన్స్గా ఇచ్చాడు రిషి. ఆ డబ్బుని వాడుకోవడానికి నాకు మనసు చెప్పలేదు అందుకే మీ దగ్గరికి తీసుకు వచ్చాను అంటాడు సారధి. అయినా మినిస్టర్ నమ్మకుండా వసుధార కి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాడు. మినిస్టర్ మాటలకి కంగారు పడుతుంది వసుధార. మేము అలా ఎప్పుడూ చేయండి సార్ నేను సార్ వచ్చి మీతో మాట్లాడతాను అంటుంది.
రిషి బిజీగా ఉంటాడేమో.. నువ్వు జగతి మేడం రండి అంటాడు మినిస్టర్. సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది వసుధార. ఈలోగా శైలేంద్ర వచ్చి ఎందుకు ఇంత పని చేశావు. ఆ చెక్ మీద నీ సంతకాలు ఉన్నాయట రిషి ఎప్పుడు అలాంటి పని చేయడు నా డౌట్ అంత నీ మీదే అనటంతో జగతి, దేవయాని ఇద్దరు అవాక్కవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.