- Home
- Entertainment
- తనతో డేటింగ్ చేస్తానన్న సారా అలీ ఖాన్ కి విజయ్ దేవరకొండ హాట్ క్యూట్ రిప్లై... ఇంతకీ ఏం పంపాడంటే!
తనతో డేటింగ్ చేస్తానన్న సారా అలీ ఖాన్ కి విజయ్ దేవరకొండ హాట్ క్యూట్ రిప్లై... ఇంతకీ ఏం పంపాడంటే!
బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. దానికి తాజా సంఘటనే నిదర్శనం. స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ ఆయనతో డేటింగ్ చేస్తా అన్నారు. ఇక ఆమె కామెంట్స్ కి విజయ్ దేవరకొండ స్పందించడం విశేషం.

Vijay Devarakonda
టాక్ షో కాఫీ విత్ కరణ్ కి దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా చాలా ఏళ్లుగా ఈ షో కొనసాగుతుంది. తాజాగా కొత్త సీజన్ ప్రారంభం కాగా అనేక మంది స్టార్స్ పాల్గొంటున్నారు. స్టార్ కిడ్స్ సారా అలీఖాన్, జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ షోకి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన అడిగిన ఓ ప్రశ్నకు సారా అలీ ఖాన్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
Vijay Devarakonda
ఒకవేళ డేట్ కి వెళ్లాలనుకుంటే ఎవరితో వెళతావని కరణ్ సారాను(Sara Ali Khan) అడిగారు. సమాధానం చెప్పడానికి మొదట సంశయించిన సారా తర్వాత విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. ఇక బాలీవుడ్ లో అంత మంది స్టార్స్ ఉండగా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పడం విశేషంగా మారింది.
Vijay Devarakonda
ఇక సారా అలీ ఖాన్ కామెంట్స్ కి విజయ్ దేవరకొండ స్పందించారు. విజయ్ దేవరకొండ అని మీరు పలికిన విధానం చాలా క్యూట్ గా ఉంది. నా ప్రేమ, కౌగిలంతలు మీ కోసం అంటూ విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. విజయ్ దేవరకొండ రిప్లై వైరల్ గా మారింది. ఇక సారా, జాన్వీ పాల్గొన్న కాఫీ విత్ కరణ్ షో ప్రోమో వైరల్ గా మారింది.
Vijay Devarakonda
గతంలో కూడా సారా అలీ ఖాన్, జాన్వీ(Janhvi Kapoor) విజయ్ దేవరకొండపై తమ ప్రేమ బయటపెట్టారు. టాలీవుడ్ నుండి స్టార్స్ కి కూడా లేని ఫాలోయింగ్ విజయ్ దేవరకొండకు ఉంది. ఇక లైగర్ మూవీతో ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఆగస్టు 25న లైగర్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల లైగర్(Liger) నుండి విడుదలైన పోస్టర్ సంచలనం రేపింది.
విజయ్ దేవరకొండ న్యూడ్ గా ఉన్న ఆ పోస్టర్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఇక లైగర్ మూవీపై పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. లైగర్ చిత్ర నిర్మాతగా కరణ్ జోహార్ ఉన్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి లైగర్ నిర్మిస్తున్నాయి.
ఇక లైగర్ విడుదల కాకుండానే విజయ్ దేవరకొండ-పూరి మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. జనగణమన టైటిల్ తో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో జనగణమన తెరకెక్కిస్తున్నారు.