స్టార్ హీరో కూతురిని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్...!
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అడుగులు వేస్తుంది. ఐతే ఈ యంగ్ హీరోయిన్ తన సినిమాల కంటే వివాదాలతోనే బాగా పాప్యులర్ అవుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
స్టార్ కిడ్ సారా అలీఖాన్ ఎదో ఒక విషయంలో నెటిజన్స్ కి దొరికిపోతూ ఉంటారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, అమృత సింగ్ కూతురైన సారా అలీఖాన్ అనేక మార్లు నెటిజెన్స్ చేత ట్రోల్ చేయబడ్డారు. హీరోయిన్ కావడం కోసం తన శరీరక ఆకృతి పూర్తిగా మార్చుకున్న సారా 2018లో వచ్చిన కేధార్ నాథ్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కావడం విశేషం.
ఆ తరువాత సింబా, లవ్ ఆజ్ కల్ చిత్రాలలో నటించింది. ఇటీవల విడుదలైన లవ్ ఆజ్ కల్ మూవీలో సారా నటన అనేక విమర్శల పాలైంది. ఆమె నటనను నెటిజెన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం కూలి నంబర్ వన్, అత్రాంగి రే చిత్రాలలో సారా నటిస్తుంది.
కొన్ని రోజుల క్రితం సారా అలీ తన తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఫోటోలకు ఫోజిచ్చింది. కుటుంబంతో పాటు ఓ వెకేషన్ కి వెళ్లిన సారా అలీ ఖాన్, సొంత తమ్ముడు ఇబ్రహీం తో బికినీలో ఫోటోలు దిగడం కొందరి కోపానికి కారణం అయ్యింది. తమ్ముడుతో అలాంటి బట్టలలో ఎవరైనా ఫోటోలు దిగుతారా అని ఆమెను నెటిజెన్స్ ట్రోల్ చేయడం జరిగింది.
వీటన్నింటికి మించి సారా అలీఖాన్ దేవాలయాలలో దర్శనం ఇవ్వడం, హిందూ దేవుళ్లకు పూజలు చేయడం కొందరికి నచ్చడం లేదు. ఆ మధ్య సారా అలీఖాన్ తల్లి అమృత సింగ్ తో కలిసి కేధార్ నాధ్ సందర్శించారు. ఆ ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా వాటిపై కొందరు అసహనం వ్యక్తం చేశారు.
తాజాగా వినాయక చతుర్థి సంధర్భంగా వినాయక పూజలో ఆమె పాల్గొన్నారు. దేవునికి పూజ చేస్తూ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీటిని కొందరు ముస్లింలు మరియు హిందువులు తప్పుబడుతున్నారు. ముస్లిం అయ్యుండి హిందూ దేవతలను ఎలా పూజిస్తావ్ అని కొందరు, మా హిందూ దేవతలకు నీవు పూజ చేయడకూడదని కొందరు ట్రోల్ చేస్తున్నారు. రెండు సంస్కృతుల మూలాలున్న సారా హిందూ దేవుళ్ళను పూజిస్తే తప్పు ఏమిటని కొందరు మద్దతు పలుకుతున్నారు.