sankranti 2023 : సంక్రాంతి మొనగాడు... 30 సినిమాలతో టాప్ లో సూపర్ స్టార్ కృష్ణ,
ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. సక్రాంతికి ఒక సినిమా కలిసివచ్చిందంటే చాలు..అదే సెంటిమెంట్ తో వరుస హిట్లు కొట్టిన హీరోలు చాలా మంది ఉన్నారు అందులో టాప్ లో ఉన్నారు దివంగత సూపర్ స్టార్ కృష్ణ. ఎవరూ క్రాస్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేశారు.

సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా సంక్రాంతి సెంటిమెంట్ తో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించాడు సూపర్ స్టార్. కృష్ణకి సంక్రాంతి సెంటిమెంటు మొదలైంది అసాధ్యుడు విజయంతో. ఆ నాటి నుంచి సంక్రాంతి సెంటిమెంట్ గట్టిగా తగిలింది కృష్ణకు. అప్పటి నుంచీ సంక్రాంతికి ఖచ్చితంగా తన సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలని సెంటిమెంట్ గా పెట్టుకున్నారు సూపర్ స్టార్.
అలా స్టార్ట్ అయిన కృష్ణ సెంటిమెంట్.. రికార్డు బ్రేకింగ్ అయ్యింది. 30 సంక్రాంతి సినిమాలిచ్చి ఆడియన్స్ ను అలరించారు కష్ణ. ఆయన ఖాతాలో అప్పటికే చాలా రికార్డ్ లు ఉండగా ఇది కూడా అందులో ఒకటిగా చేరిపోయింది. జనవరి 12,1968. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన 11 వ సినిమా అసాధ్యుడు మొదటి సంక్రాంతి హిట్ గా నలిచింది. ఈసినిమా వందరోజుల పండుగ చేసుకుంది. అప్పటి నుంచే సంక్రాంతి సెంటిమెంట్ స్టార్ట్ అయ్యింది. దాంతో సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదల అవ్వాలని నియమం పెట్టుకున్నారు.
అలా స్టార్ట్ అయిన సంక్రాంతి సినిమాల ప్రవాహం.. రికార్డు బ్రేకింగ్ 30 వరకూ చేరింది. కృష్ణకంటే ముందు హీరో.. అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం 28 సంక్రాంతి సినిమాలు మాత్రమే ఇస్తే.. కృష్ణ మాత్రం రెండు అడుగులు పైకి వేసి.. 30 సంక్రాంతి సినిమాలు అందించాడు. అంతే కాదు ఒక సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమాతో కూడా తలపడ్డాడు కృష్ణ.
సంక్రాంతి సినిమా అంటే కుటుంబ కథతో వుండాలన్న అప్పటి నమ్మకాన్ని కూడా కాదని ప్రయోగం చేయడానికి సాహసం చేశారు కృష్ణ. జేమ్స్ బాండ్ లాంటి యాక్షన్ థ్రిలర్ సినిమాను 1966 లో తను నటించిన గూఢచారి 116 ఘన విజయం సాధించింది. సంక్రాంతికి కృష్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది.
Super Star Krishna
తన కెరీర్ లో 350 సినిమాలకి పైగా నటించిన కృష్ణ.. అందులో రికార్డ్ స్థాయిలో.. 30 సినిమాలు సంక్రాంతికే రిలీజ్ చేశారు. అందులో ఎక్కువ శాతం హిట్లే ఉన్నాయి. ఈరకంగా.. సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్. 1968 మొదటి సంక్రాంతి సినిమా అసాధ్యుడు సూపర్ హిట్ అవ్వగా.. తర్వాత, 1969 లో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు, 1973 లో కౌబాయ్ మంచి వాళ్ళకు మంచి వాడు, 1976 లో పాడి పంటలు, 1977 లో కురుక్షేత్రం, 1978 లో ఇంద్రధనస్సు సినిమాలు వచ్చాయి.
Super Star Krishna Birthday
అంతే కాదు 1980 లో భలేకృష్ణుడు, 1981 లో ఊరికి మొనగాడు, 1983 లో బెజవాడ బెబ్బులి, 1984 లో ఇద్దరు దొంగలు, 1985 లో అగ్ని పర్వతం, 1987 లో తండ్రీ కొడుకుల ఛాలెంజ్, 1988 లో కలియుగ కర్ణుడు, 1989 లో రాజకీయ చదరంగం, 1990 లో ఇన్‌స్పెక్టర్ రుద్ర, 1992 లో పరమ శివుడు, 1993 లో పచ్చని సంసారం, 1994 లో నంబర్ వన్, 1995 లో అమ్మ దొంగా ...ఇలా సంక్రాంతి సినిమాలు పరంపర కొనసాగింది.
Super Star Krishna
సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీసు దగ్గర ఫీట్లు చేసి... తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు చాలా మంది వున్నారు. 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఎలాంటి హిట్ సాధించిందో అందరికి తెలుసు. హీరోగా రిటైయిర్ అయిన తరువాత కూడా ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా సంక్రాంతి హిట్ తోనే.. 1991 సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఏఎన్నార్.
సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీసు దగ్గర ఫీట్లు చేసి... తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు చాలా మంది వున్నారు. 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఎలాంటి హిట్ సాధించిందో అందరికి తెలుసు. హీరోగా రిటైయిర్ అయిన తరువాత కూడా ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా సంక్రాంతి హిట్ తోనే.. 1991 సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఏఎన్నార్.