‘సంక్రాంతికి వస్తున్నాం’: ఎగస్ట్రా షోలు, రామ్ చరణ్ కే దెబ్బ
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. అనూహ్యమైన ఆదరణతో థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా, అదనపు స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది.

సంక్రాంతి పెద్ద పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలసిందే. సంక్రాంతిని టార్గెట్ చేసుకుని, పూర్తి పండగ ఎంటర్టైనర్ గా ప్రచారం చేసి, ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపుకి తిప్పుకున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఇరవై నాలుగు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వెంకటేష్ సైంధవ్ మూవీతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం ఐదింతలకుపైగా వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఓవర్‌సీస్‌లోనూ తొలిరోజు ఆరు కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. రెండో రోజు,మూడో రోజు అదే పరిస్దితి. దాంతో ఈ సినిమా స్క్రీన్లు పెంచింది టీమ్.
భార్యభర్తల మధ్య ఉండే అనుమానం, ప్రేమలు, అపోహలు, గొడవలకు ఓ కిడ్నాప్ డ్రామాను జోడించి దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా ఆరంభం నుంచి ముగింపు వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించమే కలిసొచ్చింది.
రెండు రోజుల్లో రూ.77 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ వారంలోపే రూ.100 కోట్ల మార్కు దాటడం ఖాయం అని లెక్కలు వేసారు. అదే జరుగుతోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’మూవీకున్న డిమాండ్ పెరిగిపోవటంతో టీమ్ స్క్రీన్స్ పెంచేసింది. సంక్రాంతి సెలవులు కావడంతో కుటుంబాలతో కలిసి జనాలు థియేటర్‌లకు క్యూ కడుతున్నారు. అన్ని షోలు దాదాపు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించేందుకు చిత్ర టీమ్ సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది.
రామ్‌చరణ్ (Ram Charan)హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) విడుదలై దాదాపు వారం రోజులు గడిచిపోయింది. మరోవైపు బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ మాస్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలస్యంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆక్యుపెన్సీలో మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే కాస్త ఎక్కువే ఉంది.
Sankranthi, Box Office Winners, Venkatesh, Sankranthiki Vasthunnam
‘సంక్రాంతికి వస్తున్నాం’కి టికెట్ల కోసం థియేటర్‌కు వచ్చి అవి దొరక్క ఇంటికి వెళ్లిపోతున్న వాళ్లు చాలా మంది ఉంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల మరుసటి రోజుకు సంబంధించి టికెట్లు ముందుగానే థియేటర్ వారిని సంప్రదించి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి సెలవులకు తోడు, ఈ వీకెండ్ కూడా కలిసి రావడంతో చిత్రబృందం అదనపు షోలను పెంచాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో కొన్నిచోట్ల ‘గేమ్ ఛేంజర్’, షోలను తగ్గించి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనపు షోలను అడ్జెస్ట్ చేస్తున్నారు. రామ్‌చరణ్ అభిమానులకు ఇది కాస్త మింగుడుపడని విషయమే అయినా, వ్యాపారపరంగా చూసుకుంటే ‘డిమాండ్ అండ్ సప్లయ్’ని అనుసరించక తప్పని పరిస్థితని ట్రేడ్ అంటోంది. పైగా రెండు సినిమాలకు దిల్‌రాజే నిర్మాత కావడం స్క్రీన్‌లు పెంచే విషయంలో పెద్దగా సమస్యలు ఎదురు కాలేదని ఇండస్ట్రీ టాక్.