- Home
- Entertainment
- మీ తలపైన ఎక్కి కూర్చుంటా, ఇది మాత్రం ఊర మాస్.. ఛాలెంజ్ చేసి మరీ హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎంపికైన సంజన ?
మీ తలపైన ఎక్కి కూర్చుంటా, ఇది మాత్రం ఊర మాస్.. ఛాలెంజ్ చేసి మరీ హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎంపికైన సంజన ?
Sanjjanaa: బిగ్ బాస్ హౌస్ లో నటి సంజన తనలోని మాస్ యాంగిల్ బయట పెట్టారు. ఛాలెంజ్ చేసి మరీ ఆమె బిగ్ బాస్ సీజన్ 9లో తొలి కెప్టెన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. తొలి వారం ముగియక ముందే హౌస్ లో హీట్ పెరిగిపోయింది. ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సెలెబ్రిటీలు మాత్రమే కాదు.. కామనర్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు.
హౌస్ కి తొలి కెప్టెన్ ఎవరు
ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో హౌస్ కి తొలి కెప్టెన్ ఎవరు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. నటి సంజన గల్రాని సౌండ్ హౌస్ లో గట్టిగా వినిపిస్తోంది. నామినేషన్స్ లో కూడా పలువురు కంటెస్టెంట్స్ ఆమెని కార్నర్ చేస్తూ మాట్లాడారు. కానీ సంజన ఎక్కడా వెనకడుగు వేయలేదు.
సంజన వల్ల హౌస్ మొత్తం డిస్ట్రబ్
రాబోవు ఎపిసోడ్ లో హౌస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు అర్థం అవుతోంది. కేవలం సంజన వల్ల మాత్రమే హౌస్ మొత్తం డిస్ట్రబ్ అవుతోంది అని ఇతర కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రోమోలో చూపిన దానిప్రకారం ఆమెని బెడ్ రూమ్ లోకి రాకుండా నిషేదించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఛాలెంజ్ చేసిన సంజన
ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తనని కనీసం బెడ్ రూమ్ లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్న వారిని సంజన ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఛాలెంజ్ చేయడం మాత్రమే కాదు తన ఛాలెంజ్ ని నిలబెట్టుకునట్లు వార్తలు వస్తున్నాయి.
కెప్టెన్ గా ఎంపికైన సంజన ?
మీరు నన్ను బెడ్ రూమ్ లోకి రానివ్వకుంటే నేనే వస్తా.. బెడ్ రూమ్ లోకి మాత్రమే కాదు లగ్జరీ బెడ్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. మీ అందరి తలపై ఎక్కి కూర్చుంటా అని సంజన ఛాలెంజ్ చేసిందట. తాను చెప్పినట్లుగానే సంజన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో హౌస్ కి తొలి కెప్టెన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ గా ఎంపికైన వారికి లగ్జరీ బెడ్ రూమ్ లోకి స్పెషల్ ఎంట్రీ ఉంటుంది.