నీ మొగుడు వేస్ట్, మాపై చాలా నీఛమైన కామెంట్స్ చేస్తున్నారు.. సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ ఆవేదన
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల హౌస్ లోకి కొత్త సభ్యుల చేరిక.. రెండవసారి రతికకి ఛాన్స్ ఇవ్వడం ఇలా ఊహించని మలుపులతో సీజన్ 7 ఆకట్టుకుంటూ సాగుతోంది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల హౌస్ లోకి కొత్త సభ్యుల చేరిక.. రెండవసారి రతికకి ఛాన్స్ ఇవ్వడం ఇలా ఊహించని మలుపులతో సీజన్ 7 ఆకట్టుకుంటూ సాగుతోంది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఒక కంటెస్టెంట్ మద్దతుదారులు మరో కంటెస్టెంట్ పై ట్రోల్ చేయడం ఈ సీజన్ లో కూడా జరుగుతోంది.
ఆట డ్యాన్స్ షో ఫస్ట్ సీజన్ విజేతగా నిలిచిన సందీప్ అప్పటి నుంచి ఆట సందీప్ గా మారాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లి తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇది డ్యాన్స్ షో కాదు కాబట్టి సందీప్ మాస్టర్ కి పోటీ తప్పదు. సందీప్ మాస్టర్ హౌస్ లో టాస్క్ లలో చురుగ్గా పాల్గొంటూ విజేతగా నిలిస్తున్నాడు. గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్.. సందీప్ మధ్య తరచుగా మాటల యుద్ధం కనిపిస్తోంది.
సామాన్యుడిగా హౌస్ లోకి వెళ్లిన ప్రశాంత్ కి బయట నుంచి బలమైన మద్దతు లభిస్తుండడం విశేషం. ఈ క్రమంలో ప్రశాంత్ ని టార్గెట్ చేస్తున్న సందీప్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆ హీట్ ముఖ్యంగా సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ కి తగులుతోంది.
తాజాగా సందీప్ మాస్టర్ సతీమణి జ్యోతి రాజ్ ఓ ఇంటర్వ్యూలో ట్రోలింగ్ పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ప్రశాంత్ మద్దతుదారులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నీ మొగుడు వేస్ట్ అంటూ చాలా అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు. కనీసం మాటల్లో చెప్పలేని విధంగా భూతులతో టార్కెట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులని టార్గెట్ చేస్తూ టోల్ చేయడం తప్పు.
పల్లవి ప్రశాంత్ తనని సపోర్ట్ చేయండి అని చెప్పి హౌస్ లోకి వెళ్ళాడు. కానీ వీళ్ళు మాత్రం నీఛంగా ఇతరులని ట్రోల్ చేస్తూ.. ప్రశాంత్ ని ఎలిమినేట్ చేసే పనిలో ఉన్నారు అంటూ జ్యోతి రాజ్ కౌంటర్ ఇచ్చారు.
నీ మొగుడికి చెప్పు.. ప్రల్లవి ప్రశాంత్ జోలికి రావద్దు. ఇంకా చెప్పలేని మాటలతో నాపై కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ మాస్టర్ జీవితంలో ఎంతో కస్టపడి ఎదిగారు. కానీ ట్రోలర్, కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్ నైల్స్ తో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు అని జ్యోతి రాజ్ అన్నారు. ఇలా ట్రోల్ చేసే వారంతా సందీప్ మాస్టర్ కి కూడా ఫ్యామిలీ ఉంటుందని, తాము బాధపడతామని మరిచిపోవద్దని అంటున్నారు.