అవి చిన్నగా ఉన్నాయని అవమానించారు.. సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్ ..
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ అంటే వెంటనే వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. స్టార్ హీరోలకు కూడా ఓన్లీ ఆప్షన్ గా మారిన ఈ బ్యూటీ.. తాజాగో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

టాలీవుడ్ సినిమాలకు గోల్డెన్ లెగ్ లా మారింది. సంయుక్త మీనన్. సినిమాల పాలిట అదృష్ట దేవతగా మారింది. ఆమె ఏసినిమాలో ఉంటే.. ఆసినిమా సూపర్ హిట్ అన్న పేరు పడిపోయింది. ముఖ్యంగా చాలా కాలంగా హిట్లు లేక ఇబ్బందులు పడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్ష సినిమాత సక్సెస్ అందించింది బ్యూటీ. దాంతో ఆమెను టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు.
సంయుక్త మీనన్ తెలుగులో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేస్తే.. నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన బ్యూటీ డబుల్ హ్యాట్రిక్ కు కూడా ట్రై చేస్తోంది. తెలుగులో వరుసగా.. ఆఫర్లు వస్తున్నా.. మంచి కథలు.. మంచి సినిమాలు.. మంచి బ్యానర్లు చూసుకుని సినిమాలు చేస్తుంది సంయుక్తా మేనన్. అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. డబుల్ హ్యాట్రిక్ కు కూడా ట్రై చేస్తోంది బ్యూటీ.
ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన డెవిల్ అనే మూవీలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ మలయాళ ముద్దుగుమ్మ.. తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. తన సినిమా జీవితంలో ఎదుర్కొన్న విచిత్ర సంఘటనలను కూడా వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంయుక్త మీనన్.. సాయి తేజ్ సరసన విరూపాక్ష కోసం తనను తీసుకున్నప్పుడు ఆడిషన్ చేస్తామని అన్నారంటూ చెప్పింది
అప్పటికే చాలా సినిమాల్లో నటించిన నేను తెలుగులో కూడా మూడు సినిమాలు చేసి ఉన్నాను. అయినా సరే ఏమాత్రం ఆలోచించకుండా ఆడిషన్ కు ఒప్పుకున్నారు. నవరసాలు చేసి చూపించాను. విరూపాక్ష ఆడిషన్ లో తనను తాను నిరూపించుకుంది బ్యూటీ. అయితే తన కళ్లు అన్ని భావాలు పలికించాయిన వారు మెచ్చుకున్నారు అన్నది సంయుక్త. గతంలో తన కళ్లను దారుణంగా విమర్షించారంటోంది.
కెరీర్ స్టార్టింగ్ లో సంయుక్త కళ్లని చూసి చాలామంది విమర్శించేవాళ్లంట. చాలా చాలా చిన్నగా ఉన్నాయని, అస్సలు హావభావాలు పలకడం లేదంటూ.. నోటికొచ్చిన్నట్టు మాట్లాడారని.. నువ్వ హీరోయిన్ గా ఎదగడం కష్టం అన్నట్టుగా వారు మాట్లాడారని ఆమె చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు అవే కళ్లు.. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ని పలికిస్తున్నాయని మెచ్చుకుంటున్నార మురిసిపోయింది బ్యూటీ.
ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జోడీగా డెవిల్ సినిమా చేస్తోంది సంయుక్త. భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలబారు అందం. ఆతరువాత కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా చేసిన సంయుక్తా.. వెంటనే ధనుష్ సరసన సార్ సినిమాలో నటించింది. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష సినిమాలో నటించి మెప్పించింది. డిమాండ్ తో పాటు మంచి ఇమేజ్ కూడా సాధించింది.