MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • `భీమ్లా నాయక్` నటి ఫస్ట్ టైమ్‌ ఆ మూవీ.. `ఖేల్‌ ఖతమ్‌ దర్వాజా బంద్‌` చేసిన రానా

`భీమ్లా నాయక్` నటి ఫస్ట్ టైమ్‌ ఆ మూవీ.. `ఖేల్‌ ఖతమ్‌ దర్వాజా బంద్‌` చేసిన రానా

`భీమ్లా నాయక్` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన సంయుక్త మీనన్‌ రూట్‌ మార్చింది. మరోవైపు `ఖేల్‌ ఖతమ్‌ దర్వాజా బంద్‌` చేసిన రానా. ఆ కథేంటో చూద్దాం.   

Aithagoni Raju | Updated : Oct 11 2024, 12:30 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Samyuktha Menon

Samyuktha Menon

మలయాళ భామ సంయుక్తా మీనన్‌ `భీమ్లా నాయక్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచి కంటెంట్‌ ఉన్న సినిమా అవకాశాలు దక్కించుకుని విజయాలు అందుకుంది. `విరూపాక్ష`తో హిట్‌ అందుకుంది. సక్సెస్‌ ట్రాక్‌లో పడింది. ఆ తర్వాత `సార్‌` మూవీతో మరో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. `బింబిసార`తోనూ సక్సెస్‌ని కంటిన్యూ చేసింది. కానీ `డెవిల్‌` మూవీ దెబ్బకొట్టింది. ఈ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. కానీ నటిగా సంయుక్తకి మంచి మార్కులే పడ్డాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25
Asianet Image

ఇప్పుడు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది సంయుక్త మీనన్‌. ఇప్పుడు కొత్తగా మరో సినిమాని ప్రారంభించింది. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కావడం విశేషం. సక్సెస్ మారుపేరుగా హీరోయిన్ సంయుక్తను చెబుతుంటారు.

ఆమె టాలీవుడ్ లో అపజయం ఎరుగని నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో  నటించిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ రోల్ లో  యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 

35
Asianet Image

ఈ చిత్రానికి సంయుక్త ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంతమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చిన ఈవెంట్ ఇదే అనుకోవచ్చు.

సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, హీరో రానా, దర్శకులు వశిష్ట, వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ కానుంది.
 

45
Asianet Image

రానా ఆవిష్కరించిన `ఖేల్‌ ఖతమ్‌ దర్వాజా బంద్‌` ఫస్ట్ లుక్‌..

రాహుల్‌ విజయ్‌ మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. నటుడిగా ఆకట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. తాజాగా ఆయన `ఖేల్‌ ఖతమ్‌ దర్వాజా బంద్‌` సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ తాజాగా విడుదలైంది. హీరో రానా దీన్ని విడుదల చేయడం విశేషం.

`డియర్ మేఘ`, `భాగ్ సాలే` వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా `ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్` చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 

55
Asianet Image

`ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్` సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories