- Home
- Entertainment
- Intinti gruhalakshmi: సామ్రాట్ ముందు అడ్డంగా బుక్కైన నందు, లాస్యలు.. తులసి కోసం సామ్రాట్ తపన?
Intinti gruhalakshmi: సామ్రాట్ ముందు అడ్డంగా బుక్కైన నందు, లాస్యలు.. తులసి కోసం సామ్రాట్ తపన?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్ వాళ్ళ బాబాయ్,సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఈ రోజు మీటింగ్ లు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నావు? ఒక్కడివే ఉన్నావు అని అడగగా, నా ఇష్టం నేనే ceo నా ఇష్టం. అయినా నా వ్యాపార భాగస్వాములు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు భాగస్వామ్యాన్ని వదిలేసుకున్న పర్లేదు నేను మాత్రం ఒక రోజు కూడా సెలవు తీసుకోకూడదా అని మండిపడుతూ ఉంటాడు. ఇంతటిలో నందు,లాస్య లు అక్కడికి వస్తారు.సామ్రాట్ చాలా కోపంగా ఉంటాడు.
అప్పుడు లాస్య,భూమి పూజ రోజు అది అంతా జరిగినందుకు సారీ అని చెప్పి నిజంగా తులసి,మీకు నిజం చెప్పలేదు అన్న విషయం నాకు తెలియదు సార్. నాకు చెప్పే సందర్భం కూడా రాలేదు అని అనగా సామ్రాట్ తులసిని తిడతాడు.అప్పుడు లాస్య మనసులో ఆ కోపంతో మాకు ప్రాజెక్ట్ ఇస్తారా అని అనుకుంటుంది. అప్పుడు సామ్రాట్ మీకు ఒక పని చెప్తాను.వెళ్లి తులసి నీ ఎలాగైనా ఒప్పించి కంపెనీలోకి తీసుకురండి లేకపోతే మీ ఉద్యోగాలు అని అంటాడు. దానికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు.
ఈనేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు వెళ్లండి అని సామ్రాట్ వాళ్ళు బయటికి పంపించేస్తాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో వాళ్ళిద్దర్నీ భలే ఇరికించేసావురా అని అంటాడు. ఆ తర్వాత సీన్లో నందు లాస్యలు ఈయన ఏంటి ఇలా అన్నారు అని అనుకుంటారు.అప్పుడు,నేను వెళ్ళను అని నందు అంటాడు. దానికి లాస్య ఉద్యోగాలు ఊడిపోతాయి నువ్వు వెళ్ళాలి.మనకి ఒక సామెత ఉన్నది కదా అందితే తల లేకపోతే కాళ్ళు అని లాస్య అనగా తులసి చచ్చినా ఒప్పుకోదు అని నందు అంటాడు.
అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది అని లాస్య అంటుంది.నువ్వే సామ్రాట్ దగ్గరకు వెళ్లి నిజం చెప్పి సామ్రాట్ ని ఒప్పించావు,అప్పుడు సామ్రాట్ తులసి నీ కంపెనీకి రమ్మన్నారు అని చెప్తే ఒప్పుకుంటాది కదా అని ఇద్దరు ప్లాన్ వేసి ఆ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన వెంటనే అనసూయ ఎదురు పడుతుంది విషయం అంతా అనసూయ కి చెప్పినప్పుడు అనసూయ ముఖం మీద బట్టలు ఉతుకుతున్న నీళ్లను జల్లి నాకేం సంబంధం లేదు ఒప్పించుకోవాల్సిన వాళ్ళను ఒప్పించుకోండి.
మొన్న నా మాట కాదన్నా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అనుకోని వెళ్ళిపోతుంది.విషయం చెప్తే ఆనందం తో గంతులేస్తోంది అనుకుంటే ఇలా చేస్తుంది ఏంటి అని అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత పరంధామయ్య దగ్గరికి వెళ్తే పూర్తిగా విషయం వినకుండానే తులసి దగ్గరికి వెళ్లి మాట్లాడుకోండి దీనికి నాకు సంబంధం లేదు అని చెప్పేస్తాడు. తులసి దగ్గరికి వెళ్లేసరికి తులసి,నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆత్మ అభిమానం లేదు అన్నారు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఏమంటారో అని అంటుంది తులసి.అప్పుడు అక్కడకి అందరూ వస్తారు. లాస్య ఇలాగ మేము సామ్రాట్ గారిని ఒప్పించాము.నిన్ను సామ్రాట్ గారే కంపెనీ కి రమ్మన్నారు అని అనగా, మీరు ఒప్పించారని నిజం చెప్పారు అని దివ్య మీద ఒట్టేసి చెప్పండి అని తులసి అంటుంది. అప్పుడు నందు మేము భూమి పూజ రోజు జరిగిన దానికి సారీ చెప్పాము అప్పుడు సామ్రాట్ వెళ్లి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని అనగా,అది అణమాట జరిగిన విషయం.
మీరే నా చేత నిజం చెప్పద్దని చెప్పించారు అన్న విషయం మీరు సామ్రాట్ గారికి చెప్పలేదు అనామాట.అలాంటప్పుడు నేను అక్కడికి రాదల్చుకోలేదు అని అనగా మంచి పని చేసావ్ అమ్మ అని ప్రేమ్ అంటాడు.దానికి అభి, ప్రేమ్ నీ తిడతాడు. అప్పుడు లాస్య అమాయకంగా మావల్ల పిల్లలు ఇద్దరు గొడవ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది.దానికి తులసి నేను ఎక్కడికి రావడం లేదు మీ అంతటి మీరు వెళ్లి నిజం చెప్పినంత వరకు నాకు ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు.
అయినా మొన్న నన్ను అన్ని మాటలు అని కూడా ఇప్పుడు ఇంటికి వచ్చారంటే ఇప్పుడు మీకు కూడా సిగ్గు లేదు అని నేను అంటే మే మొఖం ఎక్కడ పెట్టుకుంటారు అని తులసి అని వాళ్ళని బయటికి పంపిస్తుంది. తర్వాత నందు తన ఇంట్లోకి వచ్చి సామ్రాట్ మొండిగా తులసిని తీసుకురమ్మన్నాడు. తులసి ఇంకా మొండిదీ రాను అని కూర్చున్నది అసలు ఏం చేయాలి అని అనుకుంటాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!