- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ఆఫీసులో సామ్రాట్ గురించి చాడీలు చెబుతున్న లాస్య.. లాస్యని ఉద్యోగం నుంచి పీకేసిన సామ్రాట్
Intinti Gruhalakshmi: ఆఫీసులో సామ్రాట్ గురించి చాడీలు చెబుతున్న లాస్య.. లాస్యని ఉద్యోగం నుంచి పీకేసిన సామ్రాట్
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సామ్రాట్ లాస్య మీద విరుచుకుపడుతూ, ఇష్టం వచ్చినప్పుడు మానేయడమేనా కనీసం ముందుగా చెప్పాలని కూడా తెలీదా ఇప్పటికి ఇప్పుడు మానేస్తే అక్కడున్న ఫైల్స్, పనులన్నీ ఎవరు చూసుకుంటారు మినిమం బాధ్యత కూడా లేదా అని అంటాడు. దానికి లాస్య, నేను చెప్పడానికి ప్రయత్నించాను సార్ కానీ వినలేదు దానివల్ల మన పనులేమీ మాగిపోయావు కదా ఆ పనులన్నీ నేను చూసుకుంటాను మీకు భరోసా ఇస్తున్నాను. మీకు ఎటువంటి లాస్ లేకుండా నేను జనరల్ మేనేజర్ గా పోస్ట్ తీసుకొని మీ అంచనాలను తారుమారు చేస్తాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ వెళ్లి జనరల్ మేనేజర్ పోస్ట్ ప్రింటింగ్ చేయించుకొని రా అని అనగా వెంటనే నా పేరు రాసుకుంటాను సార్ జనరల్ మేనేజర్ గా నేను చాలా మంచి పని చేస్తాను అని అంటుంది లాస్య.
సామ్రాట్ కోపంతో హలో మేడం కొంచెం కంగారు తగ్గించండి నేను చెప్పింది మీ పేరు మీద రాయమని కాదు తులసి గారి పేరు మీద అని అనగా, తన పేరు మీద ఎందుకు సార్ తను చదువు రానిది ఇంగ్లీష్ కూడా రాదు ఫైల్స్ చదవడం కూడా తెలీదు మొన్న ఇలాగే 10 కోట్లు నష్టపోయే స్థితికి వచ్చాము చివరి నిమిషంలో మా నందు కాపాడాడు అని అనగా అన్నీ ఉన్న నందు ఇప్పుడు ఏం చేశాడు మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు.తులసి అలాంటిది కాదు నాకు నమ్మకం ఉన్నది అయినా ఆ రోజు వైజాగ్ లో మనం అందరం మొద్దు నిద్ర లో ఉన్నప్పుడు తానే వెళ్లి అందరితో మాట్లాడి డీల్ కుదుర్చుకుని వచ్చింది అది ఎంత పెద్ద డీలో మనకు తెలుసు కదా ఇంక వాదన ఆపి వెళ్లి తులసి గారిని 10 నిమిషాల్లో మీటింగ్ ఉంది చెప్పండి అని అంటాడు సామ్రాట్. అప్పుడు లాస్య కోపంతో తులసి దగ్గరికి వెళ్లి తులసి తలుపు కొడుతుంది అలా తులసి లోపలికి రమ్మంటుంది. లాస్యను చూసిన తులసి ఇది నాగది. నందగోపాల్ గది పక్కన ఉన్నది అని అనగా ఆయన లేరు రారు ఉద్యోగం మానేశారు మీరందరూ అనుకున్నట్టే అయింది కదా అందరూ మా మీద పగలబడిపోయారు అని అంటుంది లాస్య.
దానికి తులసి,నీకేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఒకరి మీద నింద వేసేటప్పుడు అన్ని ఆలోచించుకొని మాట్లాడితే మంచిది అని అనగా ఇంక అవన్నీ వదిలేయ్ కానీ నాకు ఇది ఫైల్ మీద సంతకం కావాలి సామ్రాట్ గారు నిన్నే సంతకం చేయమన్నారు అని అంటుంది. నేనెందుకు చేస్తాను అని అనగా నిన్నే జనరల్ మేనేజర్ చేస్తారట ఇద్దరు అనుకున్నట్టే అయింది కదా అని లాస్య అనగా తులసి కోపంతో సామ్రాట్ దగ్గరకు వెళ్లి, నన్ను జనరల్ మేనేజర్ చేయడమేంటి సామ్రాట్ గారు నాకు ఇష్టం లేదు ముందు కూడా ఇలాగే మొత్తుకున్నాను కానీ మీరు బలవంతంగా చేశారు చివరికి నన్ను తీసేసారు ఇప్పుడు ఇలా వద్దు అని అంటుంది. మీకు ఇంకేం ఆప్షన్ లేదు తులసి గారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఒక ఫ్రెండ్ గా చేయండి.కిందటిసారి పొరపాటు అయింది నా వల్లే. ప్రతి మనిషిలోని కొన్ని కష్టమైన రోజులు వస్తాయి కదా అందులో అది కూడా ఒకటి అనుకోండి ఇంకెప్పుడు ఇలా జరగదు హనీ మీద ఒట్టేస్తున్నాను అని అనగా, తులసి మొహమాటంతో సరే అని అంటుంది.
ఇంతలో లాస్య అక్కడికి వచ్చి కొన్ని ఫైల్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సామ్రాట్ మీటింగ్ కోసం ఏ ఫైల్ అడిగినా సరే తులసి కన్నా ముందు లస్యే జవాబు ఇచ్చేది దానికి సామ్రాట్ కి కోపం వచ్చింది.ఇంతలో మీటింగ్ మొదలవుతుంది.అప్పుడు సామ్రాట్,మా జనరల్ మేనేజర్ గారు మీతో ప్రాజెక్ట్ గురించి చెప్తారు అని సామ్రాట్ అంటాడు. తులసి లెగిసి చెప్పేసరికి లాస్య లేచి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ లాస్యని ఆపి నువ్వు ఎవరివి జనరల్ మేనేజర్ నువ్వా?తులసి గారు కదా తనని మాట్లాడనివ్వండి అని లాస్యని కూర్చోబెట్టి తులసిని మాట్లాడిస్తాడు సామ్రాట్. తులసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య అవమానంగా ఫీల్ అయ్యి " వాళ్ళు ఎప్పటికైనా నిన్ను అవమానించి అక్కడి నుంచి వెళ్లేలా చేస్తారు" అని గతం లో నందు అన్న మాటలు గుర్తొచ్చి అక్కడ నుంచి లెగిసి బయటకు వచ్చేస్తుంది.
బయటికి వచ్చిన తర్వాత ఆఫీసులో వాళ్ళని అక్కడికి పిలిచి అయినా సామ్రాట్ ఏమనుకుంటున్నారు ఎప్పుడు చూడు తులసి అని తిరగడం తప్ప ఇంకేం పనిలేదు. ఆయన గారితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే అందులో 100 పదాలు తులసి గారి గురించి ఉంటాయి ఆవిడ కూడా ఏమాత్రం తక్కువ కాదు ఎంత బాగా సామ్రాన్ గారితో ఉంటుందో మెచ్చుకోవాలి ఇద్దరిని ఒకరు డబ్బులు చూసుకొని పొగరు పెంచుకుంటున్నారు, ఇంకొకరు డబ్బు ఉన్న మనిషిని చూసుకొని పొగరు పెంచుకుంటున్నారు చాలా బాగుంది అని అనగా అక్కడ ఉన్న వాళ్ళు, ఆపు ఎదవ సోది.
ఎందుకు మాకు చెప్తున్నావు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఇది ఆఫీసు అని అంటారు. అదే కదా నేను చెప్తున్నాను ఇది ఆఫీసు చదివి వచ్చిన వాళ్ళే కదా బాగా చేస్తారు ఎంబీఏ చేసిన నేను, చదువు రాని దాన్ని మేడమ్ అని పిలవలసి వస్తుంది నాకు ఏంటి కర్మ అని అనగా అందులో ఒక మనిషి,మీరు చెప్తుంది నిజమేలా ఉన్నది అని అంటారు. అప్పుడు ఇంకొకలు అలాగా సాక్షాలు లేకుండా మాట్లాడకూడదు అయినా నువ్వు నందగోపాల్ వాళ్ల రెండవ భార్యవి కదా అంటే తులసికి సవితివి కదా అని అనగా ఇప్పుడు నా విషయాలు ఎందుకు అని లాస్య అంటుంది.
అయితే సామ్రాట్ గారు తులసి గారి ఇంటికి వస్తారా లేక తులసి ఏ సామ్రాట్ గారి ఇంటికి వస్తారా అని వాళ్ళు అడుగుతారు. ఇద్దరూ ఒక్కొక్కళ్ళు ఇంటికి ఎప్పుడు వచ్చి పోయే ఉంటారు అని లాస్య అంటుంది. వెనకాతల నుంచి ఈ మాటలు సామ్రాట్ వింటాడు. అప్పుడు లాస్య వెనక్కి తిరిగి సామ్రాట్ ని చూసి ఆపేస్తుంది.ఆగిపోయావేమి లాస్య చెప్పు అని అనగా, సారీ సార్ ఏదో చిరాకు తట్టుకోలేక చెప్పేసాను లోపల ఉన్నది. ఏమనుకోవద్దు సారీ ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి అని లాస్య అంటుంది. దానికి సామ్రాట్, ఇదే క్షమాపణ నువ్వు ముందు కూడా అడిగావు ఇప్పుడు వరకు నువ్వు ఆఫీసులో ఉంటుంది కూడా తులసి గారి వల్లే.
ఆ విషయం గుర్తుంచుకో ఇంక నీకు రెండో అవకాశం ఉండదు నేను ఇప్పుడే జాబ్ నుంచి తీసేస్తున్నాను ఇప్పుడే వెళ్లిపో అని సామ్రాట్ అంటాడు. దానికి లాస్య, సారీ ఇప్పటికి ఇప్పుడు జాబ్ తీసేస్తే నాకున్న పరువు అంతా పోతుంది సార్ నాకు ఇప్పుడు ఈ ఉద్యోగం చాలా ముఖ్యమైనది అని అనగా,పరువు అనే మాట కూడా నీకు తెలుసా ఆ పరువు తులసి గారు గురించి ఊర్లో వాగినప్పుడు లేదా. అనసూయ గారు అంటే ముసలావిడ ఎవరు ఏం చెప్తే అది నమ్ముతారు అయినా అనసూయ గారి మాటల్లో తులసి గురించి బాగా వేదన కనిపిస్తుంది.నీ కళ్ళల్లో అది కూడా లేదు నువ్వు చదువుకున్న దానివే కదా ఏమాత్రం కూడా పక్క వాళ్ళ గురించి సాఫ్ట్ కార్నర్ లేకుండా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు సామ్రాట్.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!