సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?
2025 Celebrity Weddings : 2025 లో చాలామది సినిమా జంటలు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. చాలా మంది జీవితాల్లో కొత్త ఫేజ్ మొదలైంది. కొందరికి రెండో ప్రయాణం మొదలైతే, ఇంకొందరికి నచ్చిన తోడు దొరికింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరు?

సమంత - రాజ్ నిడిమోరు
2025 లో పెళ్లి చేసుకుని జంటగా మారిన వారిలో.. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పేరు ప్రముఖంగా చెప్పవచ్చు. ఆమె డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 1న ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మరోవైపు బాలీవుడ్ స్టార్ ప్రతీక్ బబ్బర్ ఫిబ్రవరిలో గర్ల్‌ఫ్రెండ్ ప్రియా బెనర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ముంబైలోని వాళ్ల అమ్మ స్మితా పాటిల్ ఇంట్లో జరిగింది. ఇది చాలా కొద్దిమంది సమక్షంలో జరిగిన పెళ్లి.
అఖిల్ అక్కినేని
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకుని ఇంటివాడు అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ పెళ్లవేడుకకు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది పెద్ద స్టార్లు హాజరయ్యారు. మరోవైపు, టీవీ ఫేమస్ నటి హీనా ఖాన్ తన బాయ్‌ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌ను ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకుంది. ఈ జంట రిజిస్టర్డ్ మ్యారేజ్ ను చాలా సింపుల్ గా చేసుకున్నారు.
అవికా గోర్ - మిలింద్ చంద్వానీ
చిన్నారి పెళ్లికూతురు ఫేమ్, టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే రియాలిటీ షో సెట్‌లో జరిగింది. అంతే కాదు ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ ఫేమ్ అశ్లేషా సావంత్, సందీప్ బస్వానా ఈ ఏడాదే నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఈ జంట 23 ఏళ్లుగా లివ్-ఇన్‌లో ఉన్నారు. మరోవైపు,
అర్మాన్ మాలిక్ - ఆష్నా ష్రాఫ్
టాలీవుడ్, బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్నా ష్రాఫ్‌ను ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకథ చాలా కాలంగా చర్చలో ఉంది. ఇది చాలా కొద్దిమంది సమక్షంలో జరిగిన పెళ్లి. మరోవైపు, ‘బాల్వీర్’ టీవీ షోతో ఫేమస్ అయిన నటుడు దేవ్ జోషి ఈ ఏడాది ఫిబ్రవరిలో తన గర్ల్‌ఫ్రెండ్ ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి నేపాల్‌లో జరిగింది. దీనికి కేవలం సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ప్రాజక్తా కోలి - వృశాంక్ ఖనాల్
నటి ప్రాజక్తా కోలి తన బాయ్‌ఫ్రెండ్ వృశాంక్ ఖనాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కర్జాత్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో జరిగింది. పెళ్లికి ముందు ఇద్దరూ దాదాపు 13 ఏళ్లు డేటింగ్ చేశారు. మరోవైపు, నటి సారా ఖాన్ నటుడు క్రిష్ పాఠక్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. దీనికి ముందు ఇద్దరూ అక్టోబర్‌లో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట హిందూ, ముస్లిం రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

