- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసి, సామ్రాట్ డ్యాన్స్‌లు.. లాస్య సెటైర్లు.. హనీకి పోటీగా లక్కీ!
Intinti Gruhalakshmi: తులసి, సామ్రాట్ డ్యాన్స్‌లు.. లాస్య సెటైర్లు.. హనీకి పోటీగా లక్కీ!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 27 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి, హని ని బాగా రెడీ చేస్తుంది. అప్పుడు సామ్రాట్,హని ని దేవుడిలా భావిస్తూ మీ తులసి ఆంటీని నీకు డాన్స్ నేర్పించి నా గుండెల మీద భారం దించమని మీరైనా చెప్పండి అని అంటాడు సామ్రాట్. అప్పుడు అయ్యో నాకు డ్యాన్స్ రాదండి అనడంతో పక్కనే ఉన్న లాస్య తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మా వాడికి కూడా డాన్స్ వచ్చు అమ్మ నీకు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తాడు అనడంతో హనీ మా తులసి ఆంటీకి కూడా ఓకే అని అంటుంది.
అప్పుడు లాస్య కథలో డ్యూయెట్లు స్టెప్పులు కూడా ఉంటాయన్నమాట అంటూ నందుని మరింత రెచ్చగొడుతుంది. మరొకవైపు అంకిత పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అభి వస్తాడు. ఎందుకు అంకిత నేను వచ్చినప్పటి నుంచి నువ్వు అమ్మ వెనకాలే తిరుగుతున్నావ్. నేను వచ్చినందుకు నీ కళ్ళల్లో సంతోషం లేదు అని అంటాడు. అప్పుడు అంకిత నువ్వంటే ఇష్టం కాబట్టి అన్ని వదులుకొని ఇక్కడ ఉంటున్నాను అని అభి కీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నీ మీద నాకు ద్వేషం కోపం లేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న బాధ తప్పితే అని అంటుంది.
ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వచ్చి అభి కి నచ్చ చెబుతాడు. మరొకవైపు సామ్రాట్ ఇంట్లో డాన్స్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. అప్పుడు సామ్రాట్ ప్రేమతో తులసిని పలకరించగా అది చూసి నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు నందు పర్మిషన్ ఇస్తే మేము వెళ్తాం సార్ అని అనగా వెంటనే తులసి ఏదైనా పని ఉందేమో వెళ్ళనివ్వండి సార్ అనడంతో వెంటనే లాస్య లేదు సార్ ఇక్కడే ఉంటాము అని అంటుంది.
ఆ తర్వాత తులసి,హనీ, టీచర్ ముగ్గురు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చూసి సామ్రాట్ ఎంజాయ్ చేస్తూ ఉండగా,అది చూసి నందు కుల్లుకుంటూ ఉంటాడు. అప్పుడులాస్య తులసిపై లేనిపోని మాటలు ముందుకు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండా లాస్య కాలుజారి కింద పడిపోతూ ఉండగా సామ్రాట్ పట్టుకోవడంతో అది చూసి లాస్య నందుని మరింత దెప్పి పొడుస్తూ ఉంటుంది.
ఆ తరువాత సామ్రాట్, తులసితో ప్రేమగా మాట్లాడుతుండగా నందు అది చూసి కోపంతో తగిలిపోతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ తులసిని రేపు కాంపిటీషన్ కు రమ్మని చెప్పగా రాలేను అనడంతో ఇంతలో హనీ అక్కడికి వచ్చి నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను ఆంటీ అంటూ తులసిని బుక్ చేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో హని వాళ్ళ కాంపిటీషన్ కి తులసి వెళ్తుంది. ఇంతలో అక్కడికి నందు లాస్య కూడా వస్తారు.
తులసి హనీ ని రెడీ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక పాప వచ్చి హనీ బాగుంది అని అనడంతో సామ్రాట్ అది చూసి సంతోష పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి లక్కీ వస్తాడు. ఇంతలోనే లాస్య నందులు కూడా అక్కడికి వస్తారు. ఇక రేపటి ఎపిసోడ్లో హనీతో కలిసి డాన్స్ చేయాల్సిన టీచర్ ఏదో ఇంటర్వ్యూ ఉండడంతో వెళ్లిపోతాను అని అంటుంది. అప్పుడు ఆ టీచర్ కి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. హనీ మాత్రం హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది.