Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
స్టార్ హీరోలో ఒకరికోసం మరొకరు త్యాగాలు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రామ్ చరణ్ కోసం చిరంజీవి తన సినిమా రిలీజ్ ను పలు సందర్భాల్లో పోస్ట్ పోన్ చేసుకోగా.. తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం.. అబ్బాయ్ రామ్ చరణ్ త్యాగం చేయబోతున్నట్టు సమాచారం.

పెద్ది కోసం మెగా అభిమానుల వెయింటింగ్
మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో.. రామ్ చరణ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో పెద్ది సినిమా తమ కోరిక నెరవేర్చుతుంది అని ఆశతో ఉన్నారు. సుకుమార్ కథ అందించడంతో పాటు.. ఈసినిమాను నిర్మిస్తుండటం, బుచ్చిబాబు డైరెక్షన్ పై నమ్మకంతో.. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని నమ్ముతున్నారు మెగా అభిమానులు. దాంతో పెద్ది సినిమా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేయగా.. ఇఫ్పుడు ఆ డేట్ పై ఆసక్తి కర చర్చ మొదలయ్యింది.
పెద్ది రిలీజ్ డేట్ మారబోతోందా?
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ మూవీ.. పెద్ది 2026 మార్చ్ 26 న చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆ డేట్ చుట్టూ ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. మార్చిలో ఎలాగైనా ఈసినిమాను రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో .. బుచ్చిబాబు టీమ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే అదే టైమ్ లో నేచురల్ స్టార్ నానీ ‘పారడైజ్’ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. ఈ రెండు సినిమాలు నిజంగా బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయా అని అనుకుంటున్న టైమ్ లో.. మరో సినిమా ఈ ఇద్దరు హీరోలకు షాక్ ఇచ్చింది.
అబ్బాయికి పోటీగా బాబాయ్ సినిమా..?
మార్చ్ రేసులో రామ్ చరణ్ పెద్ది, నాని పారడైజ్ తో పాటు.. అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరినట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ అయిపోయింది. ఈసినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. చాలా కాలం పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమా గురించి ఆలోచించారు. కానీ.. ఆతరువాత ఈమూవీపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. ఈ మధ్య కాలంలోనే ఈ సినిమాలో కథలిక మొదలయ్యింది. అంతే కాదు ఇది రీమేక్ కథ కాదని స్పష్టం చేయడం.. మూవీ నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేయడంతో.. సినిమాపై ఒక్క సారిగా హైప్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్.. ఆయన అభిమానులకు బాగా ఆకట్టుకుంటోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడు?
ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టాలీవుడ్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2026 మార్చ్ 26న విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ‘పెద్ది’, ‘పారడైజ్’ సినిమాల షూటింగ్స్ ఇంకా పూర్తికాలేదు.. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా అదే తేదీకి వస్తే, మిగతా రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశముందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ త్యాగం..?
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉందంటే.. ఇతర సినిమాలు రేస్ లోకి రావడానికి భయపడుతుంటాయి. ఆ డేట్ నుంచి తప్పుకుని వేరే డేట్ ను వెతుకుంటాయి. ఇది ఎప్పుడూ సహజంగా జరిగేదే. అయితే రామ్ చరణ్ రిలీజ్ డేట్ రోజే.. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. అబ్బాయి సినిమాకు అడ్డుగా.. బాబాయ్ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తాడని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ తప్పక అదే డేట్ కు రిలీజ్ చేయాల్సి వస్తే.. ‘పెద్ది’ సినిమా డేట్ మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
పవర్ స్టార్ అభిమానులు వెయింటింగ్..
పవన్ కళ్యాణ్ ఉస్తాడ్ భగత్ సింగ్ తో .. మార్చ్ 26 వస్తే.. పెద్ది సినిమాతో పాటు.. నాని ‘పారడైజ్’ కూడా రేస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు సమ్మర్ సీజన్‌లో ఏప్రిల్ లేదా మే నెలల్లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. ఇక పవన్ అభిమానులు ‘ఓజీ’ భారీ సక్సెస్ తో మంచి ఊపుమీద ఉన్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెడీ అవుతున్నారు. మార్చ్ 26 డేట్‌పై అధికారిక ప్రకటన రిలీజ్ అయితే.. 2026 టాలీవుడ్ సినిమా రిలీజ్ క్యాలెండర్‌లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

