‘కొబ్బరి మట్ట’ మూవీ రివ్యూ
First Published Aug 10, 2019, 2:40 PM IST
సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తూ...ఓ నాన్ స్టాప్ డైలాగ్ చెప్పి సినిమాకు హైప్ ని తెచ్చాడు. ఈ హైప్ కు తగ్గ స్దాయిలో సినిమా ఉందా..'హృదయ కాలేయం' తరహాలోనే ఈ సినిమా సైతం సెటైర్ తో సాగుతుందా... కథేంటి ...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

(Review By.. సూర్య ప్రకాష్ జోశ్యుల) 'హృదయ కాలేయం'తో ఇటు కాంప్లిమెంట్స్ తో పాటు కాలర్ పట్టుకునే స్దాయి విమర్శలను సైతం అందుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. చాలాకాలం గ్యాప్ తీసుకుని.. మరోసారి అదే టీమ్ తో కొబ్బరి మట్టతో థియోటర్స్ లో కాలుపెట్టాడు. అంతేకాదు త్రిపాత్రాభినయం చేస్తూ...ఓ నాన్ స్టాప్ డైలాగ్ చెప్పి సినిమాకు హైప్ ని తెచ్చాడు. ఈ హైప్ కు తగ్గ స్దాయిలో సినిమా ఉందా..'హృదయ కాలేయం' తరహాలోనే ఈ సినిమా సైతం సెటైర్ తో సాగుతుందా... కథేంటి ...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..? తరతరాల వారసత్వాన్ని తరగని ఆస్దిలా అందిపుచ్చుకున్నవాడు పాపారాయుడు (సంపూర్నేష్ బాబు). ఊరికోసం చనిపోతూ తన కొడుకు పెదరాయుడుకు తన వారసత్వాన్ని అందచేస్తాడు. ఈ పెదరాయుడుకు ముగ్గరు తమ్మళ్లు, ముగ్గురు చెల్లెల్లు...ముగ్గురు భార్యలు. వీళ్లందిరినీ ‘కొబ్బరి మట్ట’కు ఉండే ఆకుల్లా కాపాడుకుంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి ఆండ్రాయిడ్ (సంపూర్ణేష్ బాబు) వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటానని పెదరాయుడుతో తొడకొట్టి మరీ శపథం చేస్తాడు. ఇంతకీ పెదరాయుడు పోలికలతో ఉన్న ఈ ఆండ్రాయుడు ఎవరు...వీళ్లద్దరి మధ్యా ఉన్న రిలేషన్ ఏమిటి? ఆండ్రాయుడు పెదరాయుడు చేసిన అన్యాయం ఏమిటి... అతని శపథం నెరవేర్చుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?