- Home
- Entertainment
- బాడీ షేమింగ్ కి సమీరా రెడ్డి రిప్లై.. లోదుస్తుల ఫొటోషూట్స్ తో ‘ఘాటు’ సమాధానం.. క్రేజీగా నెటిజన్ల కామెంట్స్.!
బాడీ షేమింగ్ కి సమీరా రెడ్డి రిప్లై.. లోదుస్తుల ఫొటోషూట్స్ తో ‘ఘాటు’ సమాధానం.. క్రేజీగా నెటిజన్ల కామెంట్స్.!
బాడీ షేమింగ్ పై సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy) అదిరిపోయే రిప్లై ఇచ్చింది. గతంలో తనపై వచ్చిన కామెంట్స్ కు తాజాగా లోదుస్తుల ఫొటోషూట్ తో ఘాటుగా స్పందించింది. మరోసారి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ సమీరా అనిపించింది.

నటి సమీరా రెడ్డి హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించి సౌత్, నార్త్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. నటన పరంగా, గ్లామర్ పరంగా ఒకే అనిపించుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన సమీరా కొన్ని సినిమాలే చేసిన యమా క్రేజ్ పెంచుకుంది. గ్లామర్ లోనూ స్లిమ్ ఫిట్ అందాలతో ఒకప్పుడు ఊపూపింది.
అయితే, పెళ్లి తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటోంది. పలు రీల్స్, ఫ్యామిలీ పిక్స్ పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సమీరా బాడీ షేమింగ్ కు గురైంది. మ్యారేజ్ తర్వాత బరువు పెరగడం, తన రూపం మారిపోవడంతో కొందరు ట్రోల్ చేయడం ప్రారంభించారు.
బాడీ షేమింగ్ పై ఇటీవల ఓ అదిరిపోయే రీల్ చేసిన సమీరా.. మరోసారి దిమ్మతిరిగేలా బదులిచ్చింది. లోదుస్తుల ఫొటోషూట్స్ తో ‘ఘాటు’గా స్పందించింది. శరీరాకృతి ఎలా ఉన్నా.. ఎంత బరువు ఉన్నా.. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడమే గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అంటోంది. లోదుస్తులను ప్రత్యేకంగా అందిస్తున్న ‘వెస్ట్ సైడ్’ (Westside store) కోసం అదిరిపోయే ఫొటోషూట్ చేసింది.
లోదుస్తులను ధరించిన సమీరా నాజుకు అందాలతో మతిపోగొట్టింది. గతంలో తన గ్లామర్, బాడీ షేమింగ్ పై వచ్చిన కామెంట్స్ కు ఈ ఫొటోషూట్ తో బదులిచ్చింది. ఒకరినొకరు మెరుగుపరుచుకోవాలని, శరీర పరిమాణం, వాటిపై జడ్జ్ మెంట్ల అడ్డంకులను అధిగమించాలని సూచించింది. ప్రస్తుతం సమీరా ఫొటోషూట్ వైరల్ గా మారింది.
మరోవైపు సమీరా రెడ్డి అభిమానులు కూడా ఆమెకు మద్దతునిస్తున్నారు. ‘ఎలా ఉన్నా.. మీరు మా దేవతనే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేరీర్ ప్రారంభం నుంచి ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ లో సమీరా హార్డ్ వర్క్ కనిపిస్తుందని పొగుడుతున్నారు. సమీరా స్పందించిన తీరుకు అభిమానులు, నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.
2013లో ఎంటర్ ప్రెన్యూర్ అక్షయ్ వర్దెను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమీరా సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ నటి ప్రస్తుతం ఫ్యామిలీతోనే సమయం గడుపుతోంది. సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటుంది. అలాగే ఆయా అంశాలపైనా తనదైశ శైలిలో స్పందిస్తుంది.