MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రెగ్నెంట్‌ అయినందుకే పెళ్లి చేసుకుందన్నారు.. సమీరా రెడ్డి ఆవేదన.. బాడీ షేమింగ్‌ కామెంట్లపై ఓపెన్‌

ప్రెగ్నెంట్‌ అయినందుకే పెళ్లి చేసుకుందన్నారు.. సమీరా రెడ్డి ఆవేదన.. బాడీ షేమింగ్‌ కామెంట్లపై ఓపెన్‌

ఎన్టీఆర్‌ భామ సమీరా రెడ్డి తాజాగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన పెళ్లి, ప్రెగ్నెంట్‌పై వచ్చిన కామెంట్లని పంచుకుంది. తనని దారుణంగా విమర్శించారని ఆమె పేర్కొంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 14 2023, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌లతో కలిసి నటించింది టాలీవుడ్‌లో కొన్నాళ్లపాటు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది సమీరారెడ్డి. ఎంత వేగంగా వచ్చిందో, అంతే వేగంగా టాలీవుడ్‌కి దూరమయ్యింది. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సమీరా రెడ్డి.. పెళ్లి సమయంలో అనేక అవమానాలను ఫేస్‌ చేసిందట. తాజాగా ఆమె ఓపెన్‌ అయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సమీరా రెడ్డి.. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ కావడం కారణంగానే హడావుడిగా పెళ్లి చేసుకుందని కామెంట్‌ చేశారని తెలిపింది సమీరారెడ్డి. అంతేకాదు మొదటి ప్రెగ్నెంట్‌ తర్వాత తన బాడీషేమింగ్‌ కామెంట్స్ వచ్చాయట. అవి తనని చాలా బాధించాయని చెప్పింది. చివరికి కూరగాయలు అమ్మేవాడు కూడా తన బాడీపై కామెంట్‌ చేసినట్టు చెప్పింది సమీరా రెడ్డి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో తెలిసింది. 

37
sameera reddy

sameera reddy

ఆమె చెబుతూ, తన పెళ్లి విషయంలో చాలా రకాల కామెంట్లు ఎదుర్కొన్నానని చెప్పింది. 2014లో అక్షయ్‌తో తన పెళ్లి జరిగిందని, తమ ఇంటి టెర్రస్‌ పైనే సింపుల్‌గా వివాహం చేసుకున్నామని చెప్పింది సమీరా రెడ్డి. అయితే ఆ విషయంలోనే విమర్శలు వచ్చాయని తెలిపింది. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకుందని చాలా మంది కామెంట్‌ చేశారని, అవన్నీ తనని చాలా బాధించాయని పేర్కొంది సమీరా రెడ్డి. కానీ ఆ కామెంట్స్ లో నిజం లేదని, తాను పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. 

47
sameera reddy

sameera reddy

అయితే తొలి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పింది. ఓ వైపు ఆరోగ్య సమస్యలే కాదు, మరోవైపు ట్రోల్స్ కూడా ఫేస్‌ చేశానని, బాడీ షేమింగ్‌ కామెంట్లని ఎదుర్కొన్నట్టు తెలిపింది. తన కుమారుడు హన్స్ కి జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతరం బ్లూస్‌ వచ్చాయని, దీంతో బరువు పెరిగిందట. దీంతో తన బాడీలో చాలా మార్పులు వచ్చాయని పేర్కొంది. ఆ సమయంలో కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా తనని కామెంట్‌ చేశాడని పేర్కొంది. 

57

`మీకు ఏమైంది మేడమ్‌ ఇలా ఉన్నారు`, `అసలు ఇది నువ్వేలా ?`, మీరు కొంచె మారిపోయారు` అంటూ కామెంట్‌ చేశాడట. అది తనని చాలా బాధించిందని, చాలా రోజులు బాధపడినట్టు తెలిపింది. అంతేకాదు అలాంటి కామెంట్లతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయం వేసిందని, ఆ వ్యాఖ్యలు తనపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని తెలిపింది. ఆ టైమ్‌లో బాగా ఇబ్బంది పడినట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోనని, తనని ఎవరు ఎలా చూస్తున్నారనేది తనకు అవసరం లేదన్నారు. తన పని తాను చేసుకుని వెళ్లిపోతానని పేర్కొంది. 
 

67

టాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సమీరా రెడ్డి. బొద్దు అందాలతో మెస్మరైజ్‌ చేసింది. గ్లామర్‌ డోస్‌తో ఆడియెన్స్ కి చెమటలు పట్టించింది. `నరసింహుడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ హాట్‌ బ్యూటీ. ఎన్టీఆర్‌తో కలిసి నటించి అలరించింది. ఆ తర్వాత ఈ భామ చిరంజీవితో `జై చిరంజీవ` చేసింది. ఎన్టీఆర్‌ తో మరోసారి జోడీ కడుతూ `అశోక్‌`లో నటించింది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో మళ్లీ టాలీవుడ్‌ వైపు చూడలేదు. హిందీలోనే విజయాలతోపాటు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

77

2014లో వ్యాపార‌వేత్త‌ అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. 2015లో కుమారుడు హన్స్‌కు, 2019లో కుమార్తె  నైరాకు జన్మనిచ్చింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. వంటల వీడియోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. 

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved