Samantha: సమంతను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు... జనాలతో నిండిపోయిన ఆ నగరం!
పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటిపోయినా సమంత (Samantha) క్రేజ్ ఇంచు మాత్రం తగ్గలేదు. మొదటి చిత్రంతోనే కుర్రకారు మనసుల్ని దోచేసిన సమంత తన మేనియా కొనసాగిస్తున్నారు. సమంతకున్న పాపులారిటీ ఏమిటో చెప్పడానికి తాజా ఉదంతమే నిదర్శనం.

సమంత ఫిబ్రవరి 23 బుధవారం నల్గొండ పట్టణం వెళ్లారు. మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. సమంత నల్గొండ వస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ పట్టణానికి పోటెత్తారు. వేల సంఖ్యలో పోగైన జనాలు సమంతను చూడడానికి ఎగబడ్డారు.
సమంత కారులో నుండి దిగి అభిమానులకు అభివందనం చేశారు. చిరునవ్వుతో వాళ్ళను పలకరించారు. గంటల తరబడి సమంత రాక కోసం నిరీక్షించిన అభిమానులు సమంతను చూశాక తమ కష్టమంతా మర్చిపోయారు. సమంత తన నల్గొండ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. పట్టుచీరలో పదహారణాల తెలుగు పడుచులా సమంత కనిపించారు.
మాంగళ్య స్టోర్స్ చైన్ కి సమంత ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. కాగా సమంత నల్గొండ ప్రజలు నా మనసు దోచుకున్నారు అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం సమంత నల్గొండ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు సమంత తన సినిమాలతో బిజీగా ఉన్నారు. నటిగా ఎంత బిజీగా ఉన్నా సమంత ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. విడాకుల గోల నుండి బయటపడ్డ సమంత కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె అనేక కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ లో చక చకా పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం (Shaakuntalam) చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
కాగా సమంత హీరోయిన్ గా యశోద(Yashoda) టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా రూ. 3 కోట్లతో ఖరీదైన సెట్స్ నిర్మిస్తున్నారు. యశోద మూవీతో పాటు శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
వీటితో పాటు సమంత నటించిన బైలింగ్వల్ మూవీ కణ్మణి రాంబో ఖతీజా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక డిజిటల్ సిరీస్లపై కూడా సమంత ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆమె నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మొత్తంగా విడాకుల తర్వాత సమంత కెరీర్ మరింత జోరందుకోవడం విశేషం.