సమంత కొత్త బాధ్యతలు.. మెగా ఫోన్ పట్టబోతున్న స్టార్ హీరోయిన్.. రిస్క్ చేస్తుందా?
సమంత ఇప్పటి వరకు హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకుంది. నిర్మాతగానూ అదరగొట్టింది. ఇప్పుడు మరో బాధ్యతలు తీసుకుంటుందట. మెగా ఫోన్ పట్టబోతుందట.

కొత్త బాధ్యతలు తీసుకోబోతున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాను మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన నేపథ్యంలో దాన్నుంచి కోలుకునేందుకు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీ అవుతుంది. అదే సమయంలో నిర్మాతగానూ బిజీ కానుంది. ఇప్పుడు మరో బాధ్యతలు తీసుకోబోతుంది. సమంత దర్శకురాలిగా మారబోతుందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దర్శకురాలిగా మారబోతున్న సమంత
సమంత నటిగా నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి అదరగొట్టింది. మరోవైపు నిర్మాతగా మారి ఆ మధ్య `శుభం` అనే మూవీని నిర్మించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నిర్మాతగా మరిన్ని మంచి కాన్సెప్ట్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు దర్శకురాలిగానూ తానేంటో నిరూపించుకోవాలనుకుంటుందట. క్రియేటివ్ పరంగా తన ప్రతిభని చాటుకోవాలనుకుంటుందట. ఈ మేరకు ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తుందని, త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
సమంత చేస్తోన్న సినిమాలు
ఈ మూవీని తన బ్యానర్‌లోనే తనే నిర్మాతగా రూపొందించబోతుందట సమంత. ఇందులో అంతా కొత్తవాళ్లే నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై సమంత వర్క్ చేస్తుందని, త్వరలోనే క్లారిటీ రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాజ్, డీకే లతో `రక్త్ బ్రహ్మాండ్` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. దీంతోపాటు `మా ఇంటి బంగారం` అనే మూవీ చేయాల్సి ఉంది. ఇది ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు అల్లు అర్జున్, అట్లీ మూవీలోనూ సమంత పేరు వినిపిస్తోంది.
రాజ్ నిడిమోరుతో డేటింగ్
సమంత ఇటీవల ఓ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ఆమె దర్శకుడు రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాలా సందర్భాల్లో ఆమె రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా కనిపించింది. ఈ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని అమెరికాలో తిరిగారు కూడా. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సమంత. ఇది రూమర్లకి మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్‌పై ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.
ఒంటరిగానే ఉండిపోయిన సమంత
15ఏళ్ల క్రితం `ఏం మాయ చేసావే` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇందులో నాగచైతన్యతో కలిసి నటించి విజయాన్ని అందుకుని టాలీవుడ్‌లో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత టాప్ హీరోలందరితోనూ కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మరోవైపు తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం బాగానే ఉన్నా, ఈ ఇద్దరు సడెన్‌గా 2021లో విడాకులు ప్రకటించారు. కరెక్ట్ గా నాలుగు ఏళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభితా దూళిపాళని పెళ్లి చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే ఉంది.