MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సుమన్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఒక్క నిర్ణయంతో జీవితమే మారిపోయింది

సుమన్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఒక్క నిర్ణయంతో జీవితమే మారిపోయింది

సుమన్‌ టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా రాణించాల్సిన నటుడు. కానీ ఆయన జీవితంలోని వివాదాలు ఆయన్ని తొక్కేశాయి. కానీ స్టార్‌ హీరో నిర్ణయం మాత్రం ఆయన జీవితాన్ని మార్చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 23 2025, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్‌
Image Credit : sumantalwar.blogspot

యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్‌

హీరో సుమన్‌ ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి అండగాడుగా నిలిచారు. ఇప్పుడున్న సీనియర్లలో ఆయన్ని మించిన అందం ఎవరికీ లేదు. అదే సమయంలో ఒకప్పుడు మంచి స్టార్‌ హీరోగానూ రాణించారు. యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్నారు. మెగాస్టార్‌లాగా యాక్షన్‌ సినిమాలు చేసి మెప్పించారు. సుమన్‌ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబట్టాయి. మాస్‌ ఆడియెన్స్ నే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యారు సుమన్‌.  లుక్‌ పరంగా చిరంజీవికి పోటీ ఇచ్చారు. 

DID YOU
KNOW
?
సుమన్‌ని కలిసిన మొదటి హీరో మోహన్‌ బాబు
సుమన్‌ జైలు నుంచి విడుదలయ్యాక చాలా మంది కలవడానికి వచ్చారు. కానీ ఎవరినీ కలవలేదు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో మోహన్‌ బాబు. సుమన్‌కి ధైర్యాన్నిచ్చారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుమన్‌ కెరీర్‌ పీక్‌లో ఉండగా దెబ్బకొట్టిన కేసు
Image Credit : Facebook/Suman

సుమన్‌ కెరీర్‌ పీక్‌లో ఉండగా దెబ్బకొట్టిన కేసు

కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే సుమన్‌ జీవితాన్ని దెబ్బకొట్టింది ఒక కేసు. నీలిచిత్రాల కేసు ఆయన కెరీర్‌ని తలక్రిందులు చేసింది. తమిళనాడు సీఎం, ఒక రౌడీ షీటర్‌, అప్పటి డీజీపీ చేసిన కుట్రకి సుమన్‌ బలయ్యాడు. డీజీపీ కూతురు సుమన్‌పై ఇంట్రెస్ట్ చూపించడంతో దాన్ని బ్రేక్‌ చేసేందుకు పై ముగ్గురు కలిసి కుట్ర చేసి సుమన్‌ని ఈ కేసులో ఇరికించారు. జైలుకి పంపించారు. దీంతో ఆయన సినిమా కెరీర్‌ చాలా ప్రభావితమైంది. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసినా కొన్ని ఆడాయి, మరికొన్ని ఆడలేదు. హీరోగా సినిమాలు చేస్తున్నారు కానీ, మళ్లీ ఆయనేంటో చూపించే సక్సెస్‌ రాలేదు. దీంతో కెరీర్‌ డౌన్‌ అవుతూ వచ్చింది. 

35
సుమన్‌ కెరీర్‌ని మార్చేసిన శోభన్‌ బాబు నిర్ణయం
Image Credit : Facebook/శోభన్ బాబు గారి భక్తులం

సుమన్‌ కెరీర్‌ని మార్చేసిన శోభన్‌ బాబు నిర్ణయం

అలాంటి పరిస్థితుల్లో శోభన్‌బాబు.. ఆయనకు మరో లైఫ్‌ ఇచ్చాడు. ఆయన కెరీర్‌ మరో మలుపు తిప్పడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అది ఎలా అనేది చూస్తే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. నాగార్జున హీరోగా `అన్నమయ్య` సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్వరస్వామి పాత్రకి మొదట శోభన్‌బాబుని అడిగారు. అప్పటికే ఆయన రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు.

45
`అన్నమయ్య`లో వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన సుమన్‌
Image Credit : stockPhoto

`అన్నమయ్య`లో వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన సుమన్‌

అనంతరం సుమన్‌ వద్దకు ఈ పాత్ర వెళ్లింది. సుమన్‌ చేయడంతో సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్‌ ఒదిగిపోయాడు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఇలానే ఉంటాడా అనేంతగా పాత్రకి ప్రాణం పోశాడు సుమన్‌. కృష్ణుడు అంటే ఎన్టీఆర్‌ ఎలా గుర్తుకు వస్తారో, వెంకటేశ్వర స్వామి అంటే సుమన్‌ గుర్తొచ్చేలా ఆయన ఆ పాత్రలో జీవించి రక్తికట్టించారు. `అన్నమయ్య` సినిమా విజయంలో ఆయన పాత్ర కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాతో సుమన్‌ కెరీరే మారిపోయింది. దేవుడి పాత్రలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. వరుసగా అనేక సినిమాల్లో వెంకటేశ్వరుడి పాత్రలు చేశారు. అదే సమయంలో సుమన్‌కిది సినిమాల్లో సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానూ టర్న్ తీసుకుని దూసుకుపోయారు.

55
సెకండ్స్ ఇన్నింగ్స్ లో దూసుకుపోయిన సుమన్‌
Image Credit : Facebook/Suman Talwar Hero

సెకండ్స్ ఇన్నింగ్స్ లో దూసుకుపోయిన సుమన్‌

ఆ తర్వాత సేమ్‌ కాంబినేషన్‌లో `శ్రీరామదాసు` చిత్రం వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనూ నాగార్జున హీరో. ఇందులో రాముడి పాత్రని పోషించారు సుమన్‌. ఆ పాత్ర కూడా క్లైమాక్స్ లో హైలైట్‌గా నిలిచింది. సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్ళింది. ఇప్పటికీ అడపాదడపా అలాంటి దేవుడి పాత్రలు పోషిస్తూ, వెండితెర దేవుడిగా మారిపోయారు సుమన్‌. అదే శోభన్‌బాబు ఆరోజు `అన్నమయ్య` సినిమా చేసి ఉంటే సుమన్‌ కెరీర్‌ స్ట్రగుల్స్ లో ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
రాజశేఖర్‌ హీరోగా `అపరిచితుడు`, ఆ బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ ఫస్ట్ సినిమా.. ఎలా ఆగిపోయిందంటే?
Recommended image2
చిరంజీవి టాప్‌ 10 అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు.. ఫ్లాప్‌ టాక్‌తోనూ దుమ్ములేపిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved